జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఇది.


జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను కురిపిస్తోంది. కోట్ల రూపాల కలెక్షన్‌లతో దూసుకెళ్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. రిలీజైన తొలి రోజే రూ. 217 కోట్లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లను వసూలు చేసిన దేవర సినిమా దేశ వ్యాప్తంగా రూ. 77 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఏపిలోనే రూ. 68 కోట్లను క్లొగొట్టింది. దేవర సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు కొరటాల శివ వరుస హిట్లతో మంచి దూకుడు మీద ఉన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూఆ రికార్డ్‌ బ్రేకర్‌గా పేరుంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజీ భారీ హిట్‌ను సంపాదించుకుంది. హిట్‌ పెయిర్‌గా పేరొందిన వీరిద్దరి ∙కాంబినేషన్‌లో దేవర తెరకెక్కుతుండటంతో అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు, సినిమా ఇండిస్ట్రీలోను భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. దేవర ట్రైలర్‌ విడుదలైన అతి కొద్ది కాలంలోనే కోట్లాది మంది వీక్షించారు. సినిమా విడుదలైన తర్వాత కూడా పెద్ద హిట్‌ టాక్‌ను సంపాదించుకున్న దేవర మూవీ అంతకంటే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. దీనికి తోడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఈ మధ్య కాలంలో సింగిల్‌ హీరోగా నటించిన సినిమాలు లేవు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఆరేళ్లకు తారక్‌ సినిమా రావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలను వమ్ము చేయకుండా భారీ స్థాయిలోను వసూళ్లను రాబట్టింది.

దేవరలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. వీరు కలిసి నటించడం ఇదే తొలిసారి. దేవరలో మరో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో ఇంకా ప్రకాశ్‌ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్‌ టామ్‌ ఛాకో వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌లు కలిసిన నిర్మించిన దేవర చిత్రానికి ప్రముఖ తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చారు.
Next Story