
Tirumala
తిరుమలకు పోటెత్తిన భక్తులు, అలిపిరి వద్ద నిలిచిన ట్రాఫిక్
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు కావడం, 26,27 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ పెరిగింది
వేసవి సెలవులు రావడంతో తిరుమలకు రద్దీ పెరిగింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు కావడం, 26,27 తేదీలు సెలవులు కావడంతో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ పెరిగింది. భద్రతా సిబ్బంది తనిఖీ చేయడానికి విపరీతమైన ఆలస్యం అవుతుంది. దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి, వివిధ సేవలకు ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటిపోతుందేమోనని ఆందోళనతో ఒకరితో ఒకరితో పోటీ పడుతున్నారు.
అలిపిరి వద్ద నిలిచిన వాహనాలు
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. సాధారణ రోజుల్లో ఈ సిబ్బంది సరిపోతారు. వాహనాల రద్దీ పెరిగినపుడు కూడా ఈ సంఖ్య పెరక్కపోవడంతో భక్తులు చికాకుపడుతున్నారు. పిల్లలతో వచ్చిన వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
Next Story