
జగన్ పాలనలో చక్రం తిప్పిన ధాత్రి మధు అరెస్ట్
ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో కీలక పరిణామం
ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ధాత్రి మధు అరెస్ట్ అయ్యాడు. ఏపీపీఎస్సీ పేపర్స్ స్కామ్ కేసులో ధాత్రి మధును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు ఏపీ పోలీసులు. క్యామ్‌సైన్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు ధాత్రి మధు. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల వ్యాల్యూషన్ లో అక్రమాలకు పాల్పడ్డారని మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న మధును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
APPSC గ్రూప్1 పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను 2021 ఏప్రిల్28న ప్రకటించారు. ఇందుకోసం ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం రూ.1.14 కోట్లు చెల్లించింది. గ్రూప్ ఫలితాల్లో తొమ్మిది మందికి 74 మార్కులు రావడం అనుమానాలకు తావచ్చింది. కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99శాతానికి పైగా మార్కులు వేసేశారని అప్పట్లో సంచలనం రేకెత్తించింది. నిందితుని నుంచి డిజిటల్ మూల్యాంకనానికి వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అతని కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
మూల్యాంకన కుంభకోణం కేసులో మధును ఏ2గా కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకన నిర్వహణ బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో పొందిన క్యామ్‌సైన్ సంస్థ.. ఇతర విషయాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కుంభకోణంపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులను ఏ1గా చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన ఈ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు వర్గాల కథనం ప్రకారం పరీక్షల నిర్వహణ ప్రక్రియలో కొన్ని పనుల కోసం కామన్‌సైన్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ధాత్రి మధు నేతృత్వంలోని ఈ సంస్థ మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించిందని, కొందరు అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేలా మార్కులను తారుమారు చేశారని ప్రాథమిక ఆధారాలు లభించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
"పరీక్షల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. అక్రమాల పూర్తి స్థాయిని నిర్ధారించేందుకు అన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం" అని డీఎస్పీ కె. రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ పరిణామం ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన వేలాది మంది ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ప్రభావితమైన పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నియామక ప్రక్రియల్లో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం, అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు ధాత్రి మధును విజయవాడలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని మూల్యాంకన ప్రక్రియలను ఏపీపీఎస్సీ తాత్కాలికంగా నిలిపివేసింది.
మధుకి వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ లోని పలువురు అధికార, అనధికార ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. జగన్ కు మీడియా సలహాదారులుగా ఉన్న వారందరూ ఆయన సన్నిహితులే. అసెంబ్లీ సమావేశాల లైవ్ టెలికాస్ట్ ను కూడా ఆయన సంస్థ ధాత్రియే దక్కించుకుంది.
Next Story