
TTD | 28న 'డయల్ యువర్ ఈవో'
శ్రీవారి భక్తుల నుంచి సమస్యలు వినడం, సలహాల కోసం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తిరుమలలో యాత్రికులకు దర్శనం, వసతి కల్పించడానికి టీటీడీ ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఈ సేవలు అందించడమే కాాదు. యాత్రికుల నుంచి సలహాలు కూడా తీసుకుంటుంది. సమస్యలు కూడా ఆలకిస్తుంది. అవసరమైన చోట మార్పులు చేయడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రతినెలా డయల్ ఈఓ కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ కార్యక్రమం ఈ నెల 28 వ తేదీ నిర్వహించనున్నారు. దూరప్రాంతాల నుంచి కూడా ఫోన్ ద్వారా టీటీడీ ఈఓతో మాట్లాడే సదుపాయం కల్పిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని రోజుకు సగటున 65 వేల నుంచి 75 వేల మంది దర్శనం చేసుకుంటారు. యాత్రికుల కోసం అనేక వసతులు టీటీడీ కల్పిస్తోంది. సేవా టికెట్లు కూడా అందుబాటులో ఉంచుతోంది. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా యాత్రికుల కోెసం వసతి సదుపాయాలు అందుబాాటులో ఉంచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో సేవా కేంద్రాలు కూడా నిర్వహిస్తోంది.
వీటన్నింటిిని ప్రాధాన్యతలు ఒకటే. యాత్రికులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం, వసతి, మంచి అన్నప్రసాదాలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తారు.
శ్రీవారి ఆలయంలోకి దర్శననానికి వెళ్లడానికి కూడా వేకువజాము నుంచి రాత్రి పవళింపు సేవ వరకు అనేక రకాలుగా క్యూలు నిర్వహిస్తుంటారు. సామాన్య యాత్రికులు, వీఐపీలు, ఆర్జితసేవా టికెట్లు తీసుకున్న వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి అనుమతిస్తుంటారు. ఆ తరువాత తరిగొండ వెంగమాాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాల స్వీకరణకు కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే
సమస్యలు తెలుసుకోెవడానికి..
తిరుమలతో పాటు తిరుపతి, దేశంలోని టీటీడీ సమాచార కేంద్రాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తెలుసుకోవడానికి ప్రతి నెలా డయల్ యువర్ ఈఓ కార్యక్రమం టీటీడీ ప్రతినెలా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 28 వ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఈ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, సలహాలు కూడా స్వీకరిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఫోన్ నంబర్
యాత్రికులు సలహాలు ఇవ్వాలనుకుంటే, సమస్యలు ఉన్నా సరే. నెంబరు 0877-2263261 నంబర్ కు డయల్ చేయవచ్చు.
డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.