పెంపుడు కుక్కలు ఎన్ని జాతులు ఉన్నాయి, వాటి పుట్టుక ఎలా జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం పెంపుడు కుక్కలు వచ్చాయి అనే విశేషాలు తెలుసుకుందామా..


దాదాపు 10 మిలియన్‌ సంత్సరాలకు పూర్వం కుక్క ఆకారంలో ఉన్న ‘టోమార్క్‌ టాస్‌’ అనే చిన్న జంతువులు ఈ నాటి కుక్కల పూర్వీకులు. క్రీస్తు పూర్వం నుంచి ప్రపంచడంలో అనేక ప్రాంతాల్లో మానవులు తన అవసరాల కోసం, సరదా కోసం ఇష్టమైన జంతువులను పెంచుతూ వచ్చారు. విశ్వాసంగా ఉండే జాతుల్లో కుక్క ఒకటి. చాలా మంది కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రకృతి మార్పులకు అనుగుణంగా నేటి వరకు సుమారు 350 జాతి కుక్కలను అభివృద్ధి చేశారు. ఆ కుక్కల తల్లిదండ్రులను బట్టి, భౌతిక లక్షణాల కారణంగా అవి చేసే పనులను బట్టి సులభంగా అర్థం చేసుకోవడానికి కుక్కలను 7 రకాల గ్రూపులుగా విభజించారు.



ఆ ఏడు రకాల గ్రూపుల గురించి తెలుసుకుందాం
1. స్పోర్టింగ్, 2. హోండు, 3. వర్కింగ్, 4. టెర్రియర్, 5. టాయ్, 6. నాన్‌ స్పోర్టింగ్, 7. షిష్‌ హార్టింగ్‌ గ్రూపులు ఉన్నాయి.
ఈ ఏడు రకాల గ్రూపుల కింద మొత్తం 38 కుక్క జాతులు (Dog Breeds) భారత దేశంలో ఉన్నాయి. ఆ జాతుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం.


కుక్కల జాతులు
1. పాయింటర్, 2. ఇంగ్లిష్‌ సెట్టర్, 3. లేబ్రడార్, 4. ఐరిష్‌ వాటర్‌ స్పానియాల్, 5. కాకర్‌ స్పానియాల్, 6. గ్రేడ్‌హుండ్, 7. ఆఫ్‌ఘన్‌హుండ్, 8. సాలూకి, 9. బ్లడ్‌హుండ్, 10. డాషాండ్, 11. మాస్టిఫ్, 12. గ్రేట్‌ డెన్, 13. డాబర్‌మెన్, 14. బుల్‌మాస్టిఫ్, 15. రాట్‌వీలర్, 16. ఎయిర్‌డేల్‌ టేర్రియర్, 17. బుల్‌టేరియర్, 18. స్కాటిష్‌ టేర్రియర్, 19. బోర్డర్‌ టేర్రియర్, 20. నార్‌విచ్‌ టేర్రియర్, 21. పగ్, 22. పోమరేనియన్, 23. పెకింగిస్, 24. మాల్టిసి, 25. చిహు ఆహువా, 26. కిషాండ్, 27. డాల్‌ మేషియన్, 28. బుల్‌ డాగ్, 29. చౌచౌ, 30. బోస్టన్‌ టేర్రియర్, 31. బెల్జియన్‌ టేర్వురెన్, 32. బోర్డర్‌ కూలి, 33. బ్రియార్డ్, 34. రఫ్‌కూలి, 35. ఆల్సేషియన్, 36. బాక్సర్, 37. గోల్డెన్‌ రిట్రివర్, 38. లసోప్సో. ఇవన్నీ విదేశీ కుక్కల జాతులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజుపాలెం, చిట్టితారి అనే జాతులు కూడా ఉన్నాయి.
ఈ జాతి కుక్కలు మనుషులకు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నాయి. జాతి కుక్కల సేవల గురించి తెలుసుకుందాం.
1. కాపలాకు, పోలీస్‌ పనులకు, అంధులకు దారి చూపించేందుకు మత్తు మందులు తెలుసుకునేందుకు లాబ్రడార్‌ జాతి కుక్క ఉపయోగ పడుతుంది.
2. డాబర్‌మన్‌ జాతి కుక్క కాపలాకు, పోలీస్‌ పనులకు, రక్షణకు ఉపయోగపడుతుంది.
3. గ్రేట్‌ డెన్, అల్సేషన్, మాస్టిఫ్, బుల్‌డాగ్, గోల్డెన్‌ రిట్రివర్, బుల్‌ టేర్రియర్, ఆఫ్‌ఘన్‌ హుండ్, కిషాండ్, బెర్నార్డ్, బ్రియర్డ్, బాక్సర్, ఎయిర్‌ డెల్‌ టేర్రియర్‌ జాతి కుక్కలు కాపలా కొరకు ఉపయోగ పడతాయి.
4. పోమేరియన్, డాషాండ్, లాసాప్సో, పెకింగిస్, డాల్‌ మేషియన్, నార్‌ విచ్‌ టేర్రియర్, స్కాటిష్‌ టేర్రియర్, బోస్టన్‌ టేర్రియర్‌ జాతి యజమానికి తోడుగా ఉండటానికి ఉపయోగ పడతాయి.
5. రాట్‌ వీలర్, బెల్జియన్‌ టేర్వురెన్‌ జాతులు కాపలాకు, పోలీసు పనులకు, తప్పి పోయిన వారి జాడ తెలుసుకునేందుకు ఉపయోగ పడతాయి.
6. బ్లడ్‌ హుండ్‌ దొంగలను పట్టుకోడానికి, తప్పి పోయిన వారి జాడ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
7. ఐరిష్‌ వాటర్‌ స్పానియాల్, బోర్డర్‌ టేర్రియర్‌ జాతులు వేటకు పనికొస్తాయి.
8. పాయింటర్, గ్రేహుండ్, సాలూకి జాతి కుక్కలు వేటకు, రక్షణకు ఉపయోగ పడతాయి.
9. ఇంగ్లిష్‌ సెట్టర్‌ వాసన పసికట్టడానికి, వేటకు ఉపయోగ పడతాయి.
10. లేబ్రడార్, అల్సేషియన్, గ్రేహుండ్, రఫ్‌ కూలి, బెల్జియన్‌ టేర్వురెన్‌ జాతులు తేలికగా శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి.
కుక్కలతో మానశిక ఉల్లాసం
కుక్క ఎంతో విశ్వాసమైన జంతువు. మనుషులపై ఎంతో ప్రేమను కనబరుస్తాయి. చిన్నసైజ్‌ డాగ్స్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. టాయిస్‌ లాగా కనిపిస్తాయి. టాయిస్‌లో ఉంటే కనుక్కోవడం కూడా కష్టమే. వీటిని ‘కంపానియన్‌ బ్రీడ్స్‌’ అంటారు. ఉదాహరణకు సీజ్, పగ్‌ వంటివి. రెండో రకం రక్షణకు ఉపయోగిస్తారు. పెద్దసైజ్‌ డాగ్స్‌ అంటే డాబర్‌మెన్, గోల్డెన్‌ రీట్రీవర్, డాల్‌షేషియన్‌ వంటివి. ఇవి కూడా మనిషితో ప్రేమగానే ఉంటాయి. భారతదేశంలో ఉండే బ్రీడ్స్‌ను నాటు కుక్కలు అంటారు. వీటికి ప్రత్యేంగా పేర్లు పెట్టలేదు.
– డాక్టర్‌ కామని శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్, ఎన్టీఆర్‌ వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ.
Next Story