చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు ఓడారో తెలుసా.?

టీడీపీలో ఓటమి ఎరుగని నేత. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ రాజకీయాల్లోను చక్రం తిప్పారు. అయినా ఓటమి తప్ప లేదు.


చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు ఓడారో తెలుసా.?
x
Chandrababu naidu

జి. విజయ కుమార్

మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు సమకాలికులు. ఇద్దరు యువజన కాంగ్రెస్‌లో యాక్టివ్‌ రోల్‌ పోషించే వారు. అలా చంద్రబాబు రాజకీయ ప్రవేశం కాంగ్రెస్‌ నుంచే మొదలైంది. కాంగ్రెస్‌ యువజన విభాగం నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ యువజన విభాగానికి కోటా ఉండేది. 20 శాతం అసెంబ్లీ సీట్లను యువజన విభాగం నాయకులకు ఇవ్వాలనే నిబంధన ఉండట చంద్రబాబుకు అది కలిసొచ్చింది. ఎమెర్జెన్సీ సమయంలో నాటి యువజన కాంగ్రెస్‌కు అధ్యక్షుడుగా ఉన్న ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్‌ గాంధీకి సన్నిహితుడయ్యారు. దీంతో బాబు ఎన్నికల ఎంట్రీ సులువైంది. 1978లో సీటు దక్కింది. సొంత నియోజక వర్గం నుంచే ఆయన పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టారు. చంద్రగిరి నుంచి బరీలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టారు. గెలుపొందారు. నాటి ముఖ్యమ్రంతి టంగుటూరు అంజయ్య మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫి మంత్రిగా పదవి దక్కించుకున్నారు. 28 ఏళ్లకే మంత్రియ్యారు.
ఓటమి చవిచూసిన చంద్రబాబు
తన పొలిటికల్‌ కెరీర్‌లో 8 సార్లు గెలిచిన బాబు ఒక సారి మాత్రమే ఓటమి చవి చూశారు. 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎం వెంకట్రామనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. అలా తన రాజకీయ చరిత్రలో ఒక సారి మాత్రమే చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఆయన పొలిటికల్‌ కెరీర్‌లో 8 సార్లు విజయ ఢంకా మోగించిన చంద్రబాబు 1983లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నాటి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనంతరం 9 నెలలకే ఎన్నికలు వచ్చాయి. 1983లో జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకు పోయింది. అదే ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి మామ ఎన్టీఆర్‌ పార్టీ అయిన టీడీపీకి ఎదురు నిలబడ లేక పోయారు. నాడు వీచిన ఎన్టీఆర్‌ ప్రభంజనంలో చంద్రబాబు కూడా కొట్టుకొని పోయారు. టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేసేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. ఏడాది తిరక్క ముందే ఆ పార్టీలో చేరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
చంద్రగిరి నుంచి కుప్పంకు మారిన బాబు
రెండో సారి ఓటమి చవి చూసిన చంద్రబాబు తన నియోజక వర్గాన్ని మార్చు కోవాలని భావించారు. తొలి నుంచి టీడీపీకి కంచు కోటగా ఉండటంతో కుప్పంకు మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో చంద్రగిరి నుంచి కుప్పంకు మార్చుకున్నారు. 1989 నుంచి కుప్పం నుంచే పోటీ చేస్తూ ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కుప్పం నియోజక వర్గం 1955లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు రెండు సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. ఒక మారు సిపిఐ, రెండు పర్యాయాలు స్వతంత్య్ర అభ్యర్థులు గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడి నాటి నుంచి 2019 వరకు టీడీపీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. టీడీపీ వచ్చిన తొలి నాళ్లల్లో 1983, 1985లో రెండు పర్యాయాలు ఎన్‌ రంగస్వామి నాయుడు ఆ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని ఆక్రమించారు. 1989 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐలు తలపడ్డాయి. కాంగ్రెస్‌ నుంచి డి రామబ్రహ్మం, సీపీఐ నుంచి ఏపీ వజ్రవేలు చెట్టి పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామబ్రహ్మం గెలిచారు. డి వెంకటేశం రెండు దఫాలుగా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి మీద 59వేల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. 2009లో ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగాను, కే రాజేంద్రబాబును చిరంజీవి పార్టీ పీఆర్‌పీ అభ్యర్థిగాను, ఎన్‌ తులసీనాథ్‌ను బిజెపి పార్టీ అభ్యర్థిగా బరీలోకి దిగినా 46వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బాబు విజయం సాధించారు. 2014లో 47,121, 2019లో 30,722 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయ కేతనం ఎగుర వేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు
టీడీపీలో జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేప«థ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేజిక్కుంచుకున్నారు. అప్పటికే అనేక మంత్రి పదవులు నిర్వహించిన ఆయన 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీటాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి 2004 వరకు సిఎంగా కొనసాగిన చంద్రబాబు అత్యధికంగా 9 ఏళ్ల పాటు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలన చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ముఖ్యమంత్రిగా కూడా 2014లో చరిత్రలోకి ఎక్కారు. మొత్తం కలిపి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.
కేంద్ర రాజకీయాల్లోను కూడా చక్రం తిప్పారు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కింగ్‌ మేకర్‌గా మారారు. దేశ ప్రధానులుగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ఎంపికలోను, రాష్ట్రపతులుగా కేఆర్‌ నారాయణన్, అబ్దుల్‌ కలామ్‌ల ఎంపికలోను, ఉప రాష్ట్రపతిగా కృష్ణకాంత్‌కు అవకాశం కల్పించడంలోను ముఖ్య పాత్ర పోషించారు. అతని సారథ్యంలో 1999లో ఏకంగా 29 లోక్‌సభ స్థానాలు సంపాదించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. నాటి ఎన్టీఏ కూటమిలో కీ రోల్‌ పోషించారు.
బ్రాండ్‌గా బాబు
నాడు పలు కార్యక్రమాలకు బాబు బ్రాండ్‌గా మారారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్‌ కేర్, ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసులు, ప్రపంచ బ్యాంకు కార్యక్రమాలు వంటి వాటికి బ్రాండ్‌గా గుర్తింపు పొందారు.
కుటుంబ నేపథ్యం
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం నారావారి పల్లెలో 1950 ఏప్రిల్‌ 20న చంద్రబాబు జన్మించారు. చంద్రగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో డిగ్రీ, పిజిలను పూర్తి చేశారు.
వివాహ ఘడియలు
చంద్రబాబు సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. మంత్రిగా ఉన్న సయంలో చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపారు. అలా నాడు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగా వెలుగొందుతున్న నటులు నందమూరి తారక రామారావు దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ తన మూడవ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి చంద్రబాబుతో వివాహం జరిపించారు.
Next Story