ఎక్స్ కిరణాల ద్వారా వైద్య రంగంలో ఎన్నో కొత్త పద్ధతులు కనుగొన్నారు. వ్యాధి నిర్ధారణకు ఇవి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. నేడు ఎక్స్ రే దినోత్సవం.


ప్రపంచంలో రేడియాలజీ రంగం అభివృద్ధి చెందింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ (ఇఎస్ఆర్), రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్‌ఎస్‌ఎన్‌ఎ), అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ (ఎసిఆర్) కలిసి సంయుక్తంగా 2012లో రేడియాలజీ దినోత్సవాన్ని ప్రవేశపెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జాతీయ, ఇతర సంస్థలు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుగుతోంది.

ఎక్స్ కిరణాలను కనుగొన్న విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ వర్ధంతి సందర్భంగా 2011, ఫిబ్రవరి 10న యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ ఆధ్వర్యంలో మొదటి, ఒకే ఒక యూరోపియన్ రేడియాలజీ దినోత్సవం జరిగింది. ఆ దినోత్సవం విజయవంతం అవడం వల్ల దీనిని అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా నిర్వహించడానికి యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ సంస్థ రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ సంస్థల సహకారం తీసుకుంది. ఈ దినోత్సవం రాంట్జెన్ వర్ధంతి రోజు నుంచి అతను ఎక్స్-రే కనుగొన్న నవంబరు 8 తేదీకి మార్చాలని నిర్ణయించారు.

1895 లో జర్మన్ శాస్త్రవేత్త విల్‌హెల్మ్ కాన్రాడ్ రాంట్‌జెన్ ఎక్స్- కిరణాలను కనుగొన్నాడు. ఆయన వాటి పరిణామాలను గమనించిన మొదటి వాడు కాకపోయినా, వాటి గురించి పరిశోధన చేశాడు. అతనే వాటికి ఎక్స్- కిరణాలు అని పేరు పెట్టాడు. చాలామంది వీటిని కనుగొన్నా చాలా కాలం వరకు రాంట్జెన్ కిరణాలు అని పిలిచేవారు.

ఏక్స్ రే ఆవిష్కరణకు పూర్వం వైద్యుని హస్తం మాత్రమే వ్యాధి నిర్ధారణ పరికరముగా ఉండేది. ఎక్స్-రే వైద్యులకు దృష్టిని అందించినది అంటే అతిశయోక్తి కాదు వ్యాధి గ్రస్తుడి పొట్ట కోసి వ్యాధి నిర్ధారణ చేయుట ఎక్స్ రే ముందు సాధారణమైన వైద్య నిర్ధారణ పద్ధతిగా ఉండేది. ఎక్స్ రే కనిపెట్టిన వంద ఏళ్ళ తరువాత, ఇప్పుడు ఆ విధమైన సర్జరీలు అరుదై పోయాయి. వ్యక్తి ఆరోగ్యం నిర్ధారించడానికి , లేదా వ్యాధిని గుర్తించడానికి వైద్యులు సంప్రదించే వైద్యుడు రేడియాలజిస్ట్ . ఆధునిక వైద్యము అందించే ప్రతి హాస్పిటల్ నందు రేడియాలజీ వైద్యులు కీలక భూమిక పోషిస్తారు. అత్యవసర కేసులలో స్కానింగ్ పరీక్షలు చేయకుండా వ్యాధి చికిత్సా పద్దతులను అనుసరించడం కత్తిమీద సాములాంటిదే . అవసరమైన స్కానింగ్ పరీక్షలు చేయకుండా, రోగనిర్ధారణ లేకుండా ట్రయల్ -ఎర్రర్ పద్దతిలో వైద్యం చేయడాన్ని న్యాయస్థానాలు మెడికల్ నెగ్లిజెన్స్ గా పరిగణిస్తాయి.

అస్థిపంజర వ్యవస్థ, వ్యాధి గుర్తించుటకు, అలాగే మృదు కణజాలం లోని కొన్ని రోగ ప్రక్రియలను కనిపెట్టడానికి రేడియో గ్రాఫులు ఉపయోగపడతాయి. ముఖ్యమైన ఉదాహరణలు తీసుకుంటే సాధారణ ఛాతీ ఎక్స్-రే ద్వారా న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, పల్మనరీ ఏడోమా మొదలైన వ్యాధులకు, ఉదర భాగము ఎక్స్ రే తీయటం ద్వారా గుర్తించవచ్చు. పేగులలో సమస్యలు మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. మూత్ర పిండాలలోని రాళ్ళు గుర్తించడానికి ఉపయోగిస్తారు. దంత రేడియోగ్రఫీ ద్వారా సాధారణ నోటి సమస్యలు, పళ్ళలో సమస్యల రోగ నిర్ధారణకు ఉపయోగిస్తారు. హెడ్ సి‌టి స్కాన్ అనేది మెడికల్ రేడియోగ్రఫీ ఆధునిక అప్లికేషన్. ఇందులో మానవ భాగాల అడ్డ కోతలను ఎక్స్ రే ద్వారా తెలుసుకోవచ్చు.

ఫ్లౌరోస్కోపి అనేది వాడుకలో ఉండే ఒక టెక్నిక్. దీనిలో ఒక ఫ్లౌరోస్కోపేను ఉపయోగించి లోపల భాగాలలో ఉన్న కదలికల యొక్క చిత్రాలను కనుగొంటారు . మామూలుగా ఫ్లౌరోస్కోపే అంటే ఒక ఎక్స్ కిరణాన్ని పంపడానికి ఉపయోగించే పరికరం. దీనికి, రోగికి మధ్యలో ఒక ఫ్లౌరోసెంట్ స్క్రీన్ అమరుస్తారు. ఆధునిక ఫ్లౌరోస్కోప్ లతో CCD వీడియో కెమెరా సహాయంతో ఒక మానిటర్ మీద ఆ వీడియోలను చూడవచ్చు.

ఉపయోగాలు

ఎక్స్ రే క్రిస్టలో గ్రాఫి ( X-ray crystallography ) : దీని ద్వారా ఎక్స్ కిరణాలు, ఒక అణువులో ఏ విధ౦గా వివర్తనం చెందుతున్నాయో తెలుసుకుని, వాటిని పరిశీలించి ఆ అణువు గుణాలను చెప్తారు . ఇలాంటి ఒక టెక్నిక్ ఫైబర్ డైఫ్ఫ్రాక్షన్ (fiber diffraction)ను ఉపయోగించి రోశలిండ్ ఫ్రాంక్లిన్ (Rosalind Franklin) DNA రూపంను కనుగొన్నారు.

ఎక్స్ రే ఆస్ట్రోనమి (X-ray astronomy): ఇది విశ్వమును చదవడంలో ఒక ముఖ్య మైన భాగం. విశ్వములో ఉన్న వస్తువల నుండి వెలువడే ఎక్స్ కిరణాలను పరిశోధిస్తుంది.

ఎక్స్ రే మైక్రోస్కోపిక్ అనాలసిస్ (X-ray microscopic analysis) : దీనిని ఉపయోగించి విద్యుదయస్కాంత తరంగాల సహాయముతో చిన్న చిన్న వస్తువుల చిత్రములను తీస్తారు.

ఎక్స్ రే ఫ్లౌరొసెన్స్ (X-ray fluorescence): దీని ద్వారా ఒక వస్తువులో ఎక్స్ కిరణాలును పుట్టించి బయటకు పంపిస్తారు. బయటకు వచ్చే ఆ ఎక్స్ కిరణాల శక్తి ద్వారా ఆ వస్తువు కూర్పు గురించి చెబుతారు .

ఇండస్ట్రియల్ రేడియోగ్రాఫి (Industrial radiography)లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి పరిశ్రమలో వాడే పనిముట్ల పరిస్థితి గురించి తెలుకోవచ్చు.

విమానాశ్రయంలో సిబ్బంది (Airport security) ప్రయాణికుల లగేజ్ ను తనిఖీ చేయుట కొరకు ఉపయోగిస్తారు .

బోర్డర్ కంట్రోల్ (Border control) సిబ్బంది ఈ ఎక్స్ కిరణాలను ఉపయోగించి వాహనాలలో పేలుడు పదార్థాలను పసిగడతారు.

ఎక్స్ రే ఆర్ట్ (fine art photography )లో ఎక్స్ కిరణాలును ఉపయోగిస్తారు .

మన శరీరంలో ఉన్న ఎముకల యొక్క కదలికలను తెలుకొనడానికి ఉపయోగిస్తారు . (Roentgen Stereophotogrammetry ).

Next Story