తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకులను చూస్తుంటాం. ఐతే తన సర్వైవల్ కోసం ఏకంగా తల్లిదండ్రులపైనే కేసులు వేయించాడు ఆ తెలుగు మాజీ సీఎం. ఏమిటా కథ..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు డబ్బు సంపాదన కోసం చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం రాష్ట్రంలోని నాయకులకు అలవాటుగా మారింది. ఎక్కడా అవినీతికి తావు ఇవ్వకుండా పరిపాలించానని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కూడా అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. తన ఆస్తులు కాపాడుకోడానికి, తనపై పెట్టిన కేసుల్లో బలం తగ్గటానికి తన తల్లి, తండ్రి పేర్లను కోర్టు కేసుల్లోకి తీసుకెళ్లాడు. ఎందుకు ఇలా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి కుటుంబాన్ని అపురూపంగా చూసుకున్నాడు. తన బిడ్డలు ఇద్దరూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది.
తండ్రిపై జగన్ కేసు ఏమిటి?
తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ఆయన మరణానంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తనపై ఈడీ, సీబీఐ పెట్టిన కేసుల నుంచి బయట పడేందుకు చార్జ్‌షీట్‌లో నమోదు చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు బయట వారు ఎవరో చేస్తే దానికి అంతటి ప్రాధాన్యత ఉండేది కాదు. స్వయానా తన చెల్లెలు షర్మిల ఈ విషయాన్ని పదేపదే చెప్పటం చర్చగా మారింది. తండ్రి పేరు చార్జ్ షీట్‌లో ఉంటే ఎంతో మంది పేదలు దేవుడుగా భావిస్తున్న వైఎస్‌ఆర్‌పై మరింత అభిమానం పెంచుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెడతారు. అందుకే వైఎస్సార్ పేరును చార్జ్‌షీట్‌లో చేర్పించారని షర్మిల అంటోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా చెప్పారు. జగన్ కావాలనే చార్జ్ షీట్‌లో తన తండ్రి పేరును చేర్పించారని ఒక సందర్భంలో మీడియాకు చెప్పారు.
తల్లి విజయమ్మపై కేసు ఎందుకు పెట్టారు?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మపై కోర్టులో కేస్ ఫైల్ చేశారు. ఈమెతో పాటు తన చెల్లెలుపై కూడా కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు. ఇందులో మతలబు ఏమిటి? అంటే... ఆస్తులపై వ్యామోహం. అటు షర్మిలకు కూడా ఆస్తులపై వ్యామోహం ఉందనే చెప్పాలి. ఇంతకూ కేసు ఏమిటంటే తనకు తెలియకుండా తన ఆస్తిని తన చెల్లెలు పేరు మీద తన తల్లి రాసిందనేది. 2019లో తన చెల్లెలుకు సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో సగం ఆస్తిహక్కు ఉన్నట్లు గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చారు. ఈ పవర్ ఇండస్ట్రీపై పవర్ ఆఫ్ పట్టా విజయమ్మ పేరుతో ఉంది. అందువల్ల డైరెక్టర్‌లు అందరూ కూడబలుక్కుని తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఉన్న ఆస్తి కాజేసేందుకు కుట్ర పన్నారని వైఎస్ జగన్ కోర్టులో కేసు వేశారు. వచ్చేనెల 8న ఈ కేసుపై విచారణ జరగనుంది.
కోర్టుల వరకు కుటుంబ ఆస్తుల వ్యవహారం
వైఎస్సార్ కుటుంబం ప్రజాసేవకు అంకితమైనదని అందరూ భావించారు. వైఎస్ జగన్ ప్రజా ప్రతినిధి కాగానే క్విడ్‌ప్రోకోకు పాల్పడి కోట్లు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్‌ఆర్ చనిపోవడం, ఆ తరువాత జగన్‌ను అప్పటి కేంద్ర పాలకులు ఇగ్నోర్ చేయడంతో అసులు కథ మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ జగన్ కొత్త పార్టీ స్థాపించారు. ఈ పార్టీలో కుటుంబ సభ్యలంతా కలిసి పనిచేసి విజయం సాధించారు. దీంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కుటుంబ సభ్యులైన తల్లి విజయ్మ, చెల్లి షర్మిలను పక్కన బెట్టాడనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు తగినట్లు అదే జరిగింది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. అన్నా చెల్లెలు మధ్య ఆస్తుల వివాదం తారా స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.
Next Story