శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించి భంగపడిన కలమట వెంకటరమణకు అంత సీనుందా? అనేది పలువురి ప్రశ్న.


ఆంధ్రప్రదేశ్ లో పాతపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి కలమటి మోహన్ రావును ఐదు సార్లు ఇక్కడి ప్రజలు గెలిపించారు. మొదటి సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలవగా నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1989లో తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి గెలిచారు. మధ్యలో ఒకసారి లక్ష్మిపార్వతి గెలిచారు.

ఆ తరువాత రెండు సార్లు మోహన్ రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. గెలిచిన తరువాత 2014లో టీడీపీలో చేరారు. వెంకటరమణకు 2019లో టీడీపీ సీటు ఇచ్చింది. ఆయనపై పోటీ చేసిన రెడ్డి శాంతి విజయం సాధించారు. 2024లో సీటు కోసం టీడీపీలో ప్రయత్నించి భంగపడ్డారు. రెడ్డి శాంతికి వైఎస్సార్సీపీ తిరిగి 2024లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.

తనకు టికెట్ రాకుండా చేసింది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ అని కలమట వెంకటరమణ ఆరోపించారు. వారి నియోజకవర్గాలలో కాపులు ఎలా ఓటేస్తారో చూస్తామని ఆయన సవాల్ చేశారు. తన విషయంలో హై కమాండ్ తొందరలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలలో ఎవరికి బలం ఉంది అన్నది తనతో పాటు వచ్చిన వేలాది జనమే నిదర్శనం అన్నారు.

హై కమాండ్ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని కలమట స్పష్టం చేశారు. పాతపట్నం రాజకీయ ముఖ చిత్రం నుంచి కలమట ఫ్యామిలీని తప్పించే కుట్ర సాగుతోదని ఆయన ఆరోపించారు. అందుకే రాజకీయ పోరాటం చేస్తున్నానని తాను ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా సీటు సంపాదించిన మామిడి గోవిందరావు సోషల్ వర్కర్ మాత్రమే. పార్టీలో ఈయనకు పెద్దగా బలం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒక్కసారి పార్టీ సీటు ఇచ్చిన తరువాత టీడీపీ బలం అభ్యర్థి గోవిందరావు బలం కాకుండా పోతుందా? అనేది పార్టీలోని గోవిందరావు అనుకూలుర వాదన. వాదోప వాదాలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా? లేక కలమటకు కట్ట బెడుతుందా అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.

Next Story