వంగవీటి రాధాకు ఈ సారి టిక్కెట్ లేదా?
చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలో వంగవీటి రాధా పేరు లేక పోవడం, విజయవాడ స్థానాలు ఇప్పటికే వేరే వాళ్లకు కేటాయించడంతో ఆయనకు సీటు లేనట్లేనా అనే చర్చ సాగుతోంది.
జి. విజయ కుమార్
వంగవీటి రాధాకృష్ణ తండ్రి వంగవీటి మోహన్‌రంగా కాంగ్రెస్‌లో తిరుగు లేని నేతగా ఎదిగారు. బలమైన కాపు నేతగా గుర్తింపు పొందారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. 1985లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 50.75 శాతం ఓట్లు సంపాదించుకున్న రంగాకు ఆ ఎన్నికల్లో 45,575 ఓట్లు పోలయ్యాయి. 1988 డిసెంబరు 26న హత్యకు గురయ్యారు. రంగా మరణానంతరం ఆయన భార్య వంగవీటి రత్నకుమారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయవాడ తూర్పు నుంచే ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తండ్రి వారసునిగా రాజకీయాల్లోకి..
వారి వారసుడిగా రాధా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. ఇతే తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాధా 2004లో గెలుపొందారు. తర్వాత మెగాస్ఠార్ చిరంజీవి స్థాపించిన ప్రజార్యాజం పార్టీలోకి వెళ్లారు. 2009లో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 2014లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా బరీలోకి దిగి ప్రత్యర్థి టిడిపి నేత గద్దె రామ్మోహన్‌రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వైసిపి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే వైసిపి పెద్దలు సీటు కేటాయించ లేదు. దీంతో జగన్‌మోహన్ రెడ్డిపై ఆగ్రహంతో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో సీటు కేటాయించకుండా స్టార్ క్యాంపెయినర్ పేరుతో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా వైసిపి అధికారంలోకి రావడంతో మంచి భవిష్యత్‌ను పాడు చేసుకున్నారని రాధాకృష్ణ అనుచరులు, అభిమానులు అంతా నిరుత్సాహ పడ్డారనే టాక్ అప్పట్లో నడించింది. అనంతరం ఆయన టిడిపిలో కూడా యాక్టివ్‌గా ఆ పార్టీ కార్యక్రమాల్లో కనిపించ లేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా స్పందించింది లేదనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడిచింది.
రాధాను నిరాశపరిచిన బాబు..
అయితే 2024 ఎన్నికలో టిడిపి నుంచి విజయవాడ సెంట్రల్ సీటును ఆశించినట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో ఈ స్థానాన్ని రాధాకు కాకుండా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు కేటాయించారు. విజయవాడ తూర్పుకు సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ప్రకటించారు. ఇక మిగిలింది విజయవాడ పశ్చి సీటు. దీనిని పొత్తుల్లో జనసేనకు కేటాయించనున్నారు. దీంతో వంగవీటి రాధాకృష్ణకు ఎక్కడా సీటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాధా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
జనసేనలోకి వెళ్తారని ప్రచారం
సుమారు నాలుగేళ్ల పాటు రాజకీయంగా ఎక్కడా కనిపించని రాధా జనసేనలోకి వెళ్లనున్నట్లు ఇటీవల టాక్ నడించింది. గతంలో పిఆర్‌పి నుంచి పోటీ చేయడం, కాపు నేతగా గుర్తింపు ఉండటంతో పవన్ కల్యాణ్ సమయక్షంలో ఆ పార్టీ జండా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story