వాణికి మాధురి స్ట్రాంగ్ కౌంటర్.. కోర్టుకెక్కిన దువ్వాడ శ్రీనివాస్
x

వాణికి మాధురి స్ట్రాంగ్ కౌంటర్.. కోర్టుకెక్కిన దువ్వాడ శ్రీనివాస్

దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ మరో ట్విస్ట్ తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాదురితో ప్రాణ హాని ఉందన్న వాణి ఆరోపణలకు మాధురి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ మరో ట్విస్ట్ తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాదురితో ప్రాణ హాని ఉందన్న వాణి ఆరోపణలకు మాధురి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన మరుసటి రోజే వాణికి కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఈ పోస్ట్‌లో అసలు దువ్వాడ శ్రీనివాస్‌ను చంపడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌కు ఎవరితోనైనా హాని ఉందంటే అది వాణితోనే అంటూ విమర్శలు గుప్పించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి పాల్పడింది కూడా వారి కుటుంబీకులేనని మాధురి ఆరోపించారు. తన అనుచరులతో కలిసి దువ్వాడ శ్రీనివాస్‌ను హత్య చేయడానికి వాణి ప్రయత్నించారని ఆరోపణలు గుప్పించారు.

దువ్వాడ నాకు బాకీ

‘‘దువ్వాడ శ్రీనివాస్‌కు నేను రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాను. అవి తిరిగి చెల్లించిన తర్వాతే ఇంటిపై హక్కు కోరాలి. రూ.6 కోట్ల విలువైన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నా ఈ కొత్త ఇంటిపైనే కన్నెందుకో’’ అంటూ మాధురి వీడియో పోస్ట్ చేశారు. అందులో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులను కూడా చూపించారు. రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్‌పై లేని అనుమానం ఆకస్మికంగా ఇప్పుడు ఎందుకు కలిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

కోర్టుకెక్కిన దువ్వాడ శ్రీనివాస్

రోజు రోజుకు దువ్వాడ ఇంటి రచ్చ దుమారం రేపుతున్న క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు ఆంధ్ర హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి భార్య వాణి అక్రమంగా వచ్చి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షపాత్ర వహిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దువ్వాడ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ విచారణలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పోలీసులను ప్రశ్నించింది. కాగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 41ఏ నోటీసులు కూడా ఇచ్చామని పోలీసులు.. కోర్టుకు తెలిపారు. కాగా దువ్వాడ శ్రీనివాస్‌కు పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read More
Next Story