దువ్వాడ స్టోరీలో మరో ట్విస్ట్.. ఎంట్రీ ఇచ్చిన దివ్వల మాధురి..
దువ్వాడ కుటుంబ కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొంతకాలంగా వీరి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆ తర్వాత అదంతా బూటకమని బట్టబయలు కావడంతో వీరి కుటుంబ కథ భారీ క్రైమ్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తక్కువగా లేదు.
దువ్వాడ కుటుంబ కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొంతకాలంగా వీరి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆ తర్వాత అదంతా బూటకమని బట్టబయలు కావడంతో వీరి కుటుంబ కథ భారీ క్రైమ్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తక్కువగా లేదు. ఊహించని ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ప్రజల నోళ్లలో నానుతున్నారు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వల మాధురి. తాజాగా వీరి కుటుంబ కథలో మరో కీలక ట్విస్ట్ నెలకొంది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఇంట్లోకి దివ్వల మాధురి ఎంట్రీ ఇవ్వడమే ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం కీలకంగా మారడానికి ప్రధాన కారణం. ఆ ఇంట్లోకి వెళ్లడానికి దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు కొంతకాలంతా తెగ ప్రయత్నిస్తున్నారు.
తమకు తమ తండ్రి కావాలని కుమార్తెలు, తన భర్తను తనకు ఇవ్వాలని దువ్వాడ వాణి ఆ ఇంటి ముందు కూర్చుని నిరసనలు చేస్తున్నారు. వారు నెల రోజులుగా అక్కడే మకాం వేసి ఆందోళన చేస్తున్నారు. దువ్వల మాధురి.. మోసపూరిత వలలో దువ్వాడ శ్రీనివాస్ పడ్డారని, ఆయనకు మాధురితో ప్రాణ హాని ఉందంటూ దువ్వాడ వాణి ఆరోపణలు చేస్తున్నారు. కాగా రెండేళ్లుగా గుర్తుకురాని భర్త ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని, అసలు దువ్వాడ శ్రీనివాస్‌ను చంపాలని చూస్తున్నదే వాణి అంటూ ప్రతి ఆరోపణలు చేశారు దివ్వల మాధురి. ఇంతటి వివాదంలో నెలరోజులుగా తమకు ఎంట్రీ కూడా దొరకని ఆ ఇంట్లోకి దివ్వల మాధురి వెళ్లడం ఇప్పుడు వివాదాన్ని మరింత రాజేసింది. ఇన్ని రోజులు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఈరోజు అగ్నికి ఆజ్యం పోసినట్లు భగ్గుమంది.
అలా ఎలా కుదురుతుంది: వాణి
ఇంట్లోకి వెళ్లడానికి నెల రోజులు దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఆపసోపాలు పడుతున్నారు. తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ఈరోజు ఆ ఇంటి బాల్కనీలో దివ్వల మాధురి కనిపించడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ ఇల్లు తమదని అంటున్న దువ్వాడ వాణి.. ఇంట్లోకి మాధురి వెళ్లడాన్ని ఏమాత్రం సహించడం లేదు. బాల్కనీలో మాధురిని చూసిన మరుక్షణం దువ్వాడ వాణి.. అగ్గిమీద గుగ్గిలంలా ఆగ్రహంతో ఊగిపోయారు. తమ ఇంట్లోకి మాధురి ఎలా వెళ్తారని, ఆమెను వెంటనే పంపించేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాణి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాణి.. మరోమారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ మరోసారి హైడ్రామా నెలకొంది.