స్వాతంత్య్ర ఉద్యమంలో ఒకరు శాంతిని కోరుకుంటే.. మరొకరు సాయుధ పోరాటాన్ని కోరుకుంటే.. ఇంకొకరు విప్లవోద్యమాన్ని కోరుకున్నారు.


భారత స్వాతంత్య్ర ఉద్యమం ఒక మహోజ్వల చరిత్ర భరితం. అందరీ ఆలోచన ఒక్కటే. అదే విముక్త భారతం. కానీ ఎంచుకున్న మార్గాలు వేరు. నడిచిన బాటలు వేరు. బ్రిటీష్‌ సామ్రాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యమంటారు. అంటే ప్రపంచంలోని ఎన్నో దేశాలను వారు పరిపాలించారు. తిరిగి భారత దేశాన్ని వదిలి పెట్టే వరకు తరిమి కొట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రముఖల గురించి తెలుసుకున్నాం. వీరు స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాదు..స్వతంత్ర భారతా వనిలోను పేదరికం.. కుల వివక్ష.. అసమానతలు.. సామాజిక రుగ్మతలు.. వంటి అంశాలపైన మరణించే వరకు తమ ఉద్యమాలను కొనసాగించారు. అటువంటి ఆంధ్ర రాష్ట్ర జాతి రత్నాలు ఇప్పటి వారికి తెలుసా?. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ది ఫెడరల్‌ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం.

అల్లూరి జీవితం అజరామరం
సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని గట్టిగా నమ్మిన విశ్వసించిన వారిలో ఒకరు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న జన్మించి 1924 మే 7న బ్రిటీష్‌ ముష్కరుల చేతిలో తుపాకి గుళ్లకు బలయ్యారు. అల్లూరి సీతారామరాజు కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే నిరుపేదలు.. నిరక్ష రాస్యులు.. సమాజం పట్ల ఏమాత్రం అవగాహన లేని అమాయకులను తన అనుచర వర్గంలో చేర్చుకొని బ్రిటీష్‌ సామ్రాజ్య మహా శక్తిని ఢీ కొన్నాడు. అల్లూరి సీతారామరాజు సమాధిని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవి పేటలో నిర్మించారు. ఇది విశాఖపట్నానికి 114కిమీ దూరంలో ఉంటుంది. సీతారామరాజు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు మండలం బట్టేలంక గ్రామంలో స్థిపడిన వ్యక్తి. కోమటిలంక గోదావరిలో మునిగి పోవడం వల్ల అక్కడి అల్లూరి వంశీకులు అప్పనపల్లి, అంతర్వేదిపాలెం, గుడిమారలంక, దిరుసుమర్రు, మౌందపురం వంటి చోట్లకు వలసలు వెళ్లారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు గుంటూరు జిల్లా నరసరావుపే తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ నంచి అల్లూరి సీతారామరాజు పూర్వీకులంతా
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ అల్లూరి దాయాదులున్నారు. అల్లూరి విద్యాభ్యాసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సాగింది. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హటయోగం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేద వైద్యం గురించి నేర్చుకున్నారు.
రాయలసీమ రత్నం
1846 జూన్‌లో బ్రిటీష్‌ వారిపై ఎగుర వేసిన తిరుగుబాటు జెండా 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నుంచి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండే వాళ్లు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. బ్రిటీష్‌ దొర తనాన్ని ఎదిరించి వీర మరణం పొందారు. బ్రిటీష్‌ వారు ఆయనను ఉరి తీశారు. రేనాటి సీమలోనా.. రెడ్డోళ్ల కులములోనా.. దొర వారి వంశానా.. ధీరుడే నరసింహారెడ్డి అంటూ అప్పట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పాట కూడా ప్రసిద్ధి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి సినామా కూడా తీశారు.
గొట్టిపాటి బ్రహ్మయ్య
స్వాతంత్య్ర సమరయోధుడు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత. 1922–23 కాలంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు. 1923–29 కాలంలో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డు అధ్యక్షుడు. 1962లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు. 1964 నుంచి 1968 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అధ్యక్షుడు. 1989 డిసెంబరు 3న కృష్ణా జిల్లాలోని చినకళ్లేపల్లిలో జన్మించారు. సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలు మార్లు జైలు పాలయ్యారు.
Next Story