గత ఎన్నికలతో పోల్చితే 3.5 రెట్లు పెరిగిన ముందస్తు ఓటింగ్‌
x

గత ఎన్నికలతో పోల్చితే 3.5 రెట్లు పెరిగిన ముందస్తు ఓటింగ్‌

ఉద్యోగ ఓటర్లలో చైతన్యం పెరిగింది. అధిక సంఖ్యలో తమ ఓటును వినియోగించుకున్నారు.


గత ఎన్నికలతో పోల్చితే ముందస్తు ఓటింగ్‌ భారీగానే పెరిగింది. 2019 ఎన్నికల కంటే ఈ సారి 3.5 రెట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పెరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లలో 1.2లక్షల ఓట్లు సచివాలయ ఉద్యోగులవేనని సమాచారం. మరో 2లక్షల ఓట్లు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఉన్నట్లు తెలిసింది. పోలీసు శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఓట్లు 40వేల వరకు నమోదయ్యాయి. హోమ్‌ ఓటింగ్‌ ఆప్షన్‌ కింద 85 ఏళ్లు దాటిన వృద్ధుల ఓట్లు 28వేల వరకు ఉన్నాయి. ఎసెన్షియల్‌ సర్వీస్‌ కేటగిరీలో 31వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మే 4 నుంచి మే 9 వరకు ఆరు రోజుల పాటు పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 4,44,216 మంది అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో అత్యల్పంగా 14,526 ఓట్లు పోలయ్యాయి. జూన్‌ 4న సాధారణ ఈవీఎంలతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కూడా కౌంటింగ్‌ చేస్తారు. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్ల బ్యాక్సులు నియోజక వర్గాల వారీగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్‌ 3,5 రెట్లు అధికంగా నమోదు కావడం ప్రజాస్వా మ్య చైతన్యానినికి నిదర్శనమన్నారు. ఓటింగ్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందుండాలని చేసిన ప్రచారం సక్సెస్‌ అయిందన్నారు.
Read More
Next Story