ఆ చట్ట సవరణే వస్తే అసైన్డ్ భూముల లబ్ధిదారుల నోట మట్టే!
x

ఆ చట్ట సవరణే వస్తే అసైన్డ్ భూముల లబ్ధిదారుల నోట మట్టే!

ఏపీ అసైన్డ్ భూముల చట్టం- 977 సవరణ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం- 1977లో సవరణ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నజీర్‌కు లేఖ రాశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. లబ్ధిదారుల ఆర్ధిక పరిస్థితిని ఆసరా చేసుకున్న కొందరు భూ బకాసురులు లబ్ధిదారులను బెదిరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన వర్గాలకు ఇచ్చే అసైన్డ్ భూములు అసలైన లబ్ధిదారులకే దక్కాలంటే గవర్నర్ జోక్యం అవసరమని శర్మ పేర్కొన్నారు. ఆయన లేఖలో ఏముందంటే..

‘‘రాష్ట్రప్రభుత్వం 19 డిసెంబర్‌ 2023లో జీఓఎం 596ను జారీ చేసింది. సొంత స్థలం లేని వెనకబడిన తరగతుల వారికి షరతులతో కొంత భూమిని అందించే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆ భూములను కలిగి ఉండటానికి ఆ లబ్ధిదారులకు హక్కు కల్పిస్తుంది. వీరిలో అత్యధికంగా ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు ఉన్నారు. ఇనామ్ భూములను కూడా ఈ జీఓఎమ్ కిందకే వస్తాయి. ఆంధ్ర అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం 1977 ప్రకారం ఈ భూములను ఎవరు కొనుగోలు చేయకూడదు.

సొంత స్థలం లేని వెనకబడిన తరగతుల వారిని భూములను కేటాయించడం ద్వారా ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో చేరింది. ఈ భూమిని మూడో వ్యక్తికి అమ్మడం, ఇవ్వడం అనేవి చట్ట విరుద్ధం. ప్రభుత్వం ఇచ్చిన భూములు కేవలం లబ్దిదారులకు మాత్రమే చెందుతుంది. ఆ భూములకు ప్రభుత్వం ఒక ధర్మకర్తగా మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా అలా మూడో వ్యక్తి ఇచ్చినా లేదా అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవాల్సి వచ్చినా.. దానిని మూడో వ్యక్తి నుంచి తీసుకుని తిరిగి అసలు లబ్ది దారుకు లేదంటే కొత్త లబ్దిదారుకు అందిస్తుంది. ఈ చట్టం చేసే పని ఇది. ఇందులో ఏమైనా సడలింపులు జరిగితే ప్రభుత్వ భూములు పరోక్షంగా అనర్హుల చేతుల్లోకి వెళతాయి. ఏవిధంగానైనా ఫ్రీహోల్డ్ హక్కు (ఎవరైనా కలిగి ఉండే హక్కు)ను కల్పిస్తే అది చట్ట వ్యతిరేకంగా మారుతుంది. ప్రజల విశ్వాస మూల సూత్రాన్ని అతిక్రమించడమే అవుతుంది. వీటిని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉంది.

సాధారణంగా ఈ కోర్సులో భూమి అసైనీలుగా ఉన్న వారిని ఆర్థికంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. వారికి సాగు భూములు ఇవ్వడం ద్వారా దీనిని సాధించవచ్చు. అందుకు సాగులో ఉన్న భూములను కనిపెట్టడానికి వారికి కాస్త సమయం ఇవ్వాలి. వారు ఆర్థికంగా బలపడటానికి సహాయం అందించాలి. ప్రభుత్వం నుండి తగిన మద్దతు లేకపోవడంతో హద్దు గీసుకుని బతకాల్సి వస్తున్నప్పటికీ అసైనీలు తమ ఆక్రమిత భూములను సాగు చేస్తున్నారు. కాలక్రమేణా పలుకుబడి బాగా ఉన్నవారు తమ ఆర్థిక బలాన్ని వినియోగించుకుని సదరు భూముల అసైనీలను బలవంతంగా తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై గ్రామ రెవెన్యూ రికార్డులను కూడా భూ బకాసురులు తారుమారు చేసి అసైన్ దారులకు నష్టం వచ్చేలా చేస్తున్నారు. అలాంటి వారి నుంచి ఇప్పుడు ఈ భూమి అసైన్ ఒరిజినల్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ వెసులుబాటు కల్పించేలా సవరణ చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్దమైన భూ అన్యాక్రాంతాలను అనుమతించడానికి ఒక మార్గం.

ఇనామ్ భూముల వ్యవహారం, అసైన్డ్ భూముల వ్యవహారం దగ్గర దగ్గర ఒకటే. ఇనామ్ భూముల వ్యవహారంలో కూడా కొందరు కబ్జాదారులు - లబ్దిదారులను తమ అంగ, అర్థ బలంతో బెదిరించి వారి భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు చట్టంలో సవరణ తేవాలని కొందరు వత్తిడి చేస్తున్నారు. ఈ సవరణ నా దృష్టిలో.. రాష్ట్రంలోని అసైన్డ్, ఇనామీ భూములు రెండింటినీ అన్యాక్రాంతం చేయడాన్ని చట్టబద్దం చేయాలన్న ఉద్దేశంతోనే 19 డిసెంబర్ 2023 నాటి జీఓఎంఎస్ నెం.596 అని భావిస్తున్నా. ఇది లబ్ధిదారుల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం" అన్నారు శర్మ.

ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. జీఓ అమలును, చట్టంలో సవరణలను నిలిపివేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రంలోని లక్షలాది వెనకబడిన కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు శర్మ.

Read More
Next Story