ELECTRICITY BILLS | సులభంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు
x

ELECTRICITY BILLS | సులభంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు

ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతిలో ప్రయోగాత్మక పద్ధతిని అమలులోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ బిల్లులపై ముద్రించనున్నారు.


విద్యుత్ వినియోగదారులకు బిల్లల చెల్లింపును సులభతరం చేసింది. ఏపీ ఎస్పీడీసీఎల్ (Andhra Pradesh Southern Power distribution company limited -Apspdcl) వినియోగదారుల కోసం

కరెంటు బిల్లుపై క్యూఆర్ కోడ్ (Q R code) ముద్రించింది. దీనిని స్కాన్ చేయడం ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత నెల, డిసెంబర్ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తెలిపారు.
ఆగిన యూపీఐ సేవలు
ఈ ఏడాది జూన్ వరకు యూపీఐ ( (Unified Payment Interface-UPI) సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ స్టేట్ బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India- RBI) ఆదేశాలతో విద్యుత్ సంస్థలు ఆ ప్లాట్ఫారం ద్వారా బిల్లు తీసుకోవడానికి సేవలు నిలిపివేశాయి. ఈ పద్ధతి అమలులో ఉన్నప్పుడు సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు ఉండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల సేవలు దూరం అయ్యాయి..
ఆ రెండే కారణాలు..
యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న సంస్థలకు వినియోగదారులు చెల్లించే నగదు వెళ్ళేది. అక్కడి నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ ఖాతాలకు రీ-డైరెక్ట్ చేసేవారు. అయితే, ఆ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సకాలంలో ఏపీఎస్పీడీసీఎల్ ఖాతాలకు నగదు జమ కాలేదు.
దీనిపై Apspdcl సంస్థ ఓ అధికారి ' ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, వినియోగదారుల నుంచి యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నగదు బిల్లుల చెల్లింపులు జరిగేవి. ఆ మొత్తం మా సంస్థ ఖాతాకు సకాలంలో జమ కావడం లేదు" అని చెప్పారు. దీనివల్ల ఏపీఎస్పీడీసీఎల్ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అని స్పష్టం చేశారు. అంతేకాకుండా,
యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీఎస్పీడీసీఎల్ వల్ల ఎక్కువ ఆదాయం కూడా ఉండేది.
ఉదాహరణకు విద్యుత్ వినియోగదారుడు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా బిల్లు చెల్లిస్తే, అందులో ఓ కనెక్షన్ కు రు. 2.50 రూపాయలు కమిషన్ ప్రొవైడర్లకు దక్కుతుంది. మిగతా మొత్తం ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థకు అందేది. "ఇందులో కూడా జాప్యం చేస్తున్న కారణంగానే ఆర్బిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది" అని ఏపీఎస్పీడీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. ఈ రెండు కారణాల వల్లనే యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బిల్లులు చెల్లించే పద్ధతిని రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా
విద్యుత్ బిల్లులను పాత పద్ధతిలోనే మీసేవ కేంద్రాలు లేదా ఏపీఎస్పీడీసీఎల్ సబ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా విద్యుత్ బిల్లుల వసూలుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సబ్-స్టేషన్ల వద్ద బిల్లులు చేస్తే అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లడం వల్ల సర్వీస్ ఛార్జ్ కింద ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా కాదని..
క్యూ ఆర్ కోడ్ అమలు
విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను సరళతరం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. ఆ మేరకు తిరుపతి నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు చెబుతున్నారు. ఈనెల (డిసెంబర్) నుంచి జారీ చేసే కరెంటు బిల్లు పై భాగంలోనే క్యూఆర్ కోడ్ ముద్రిస్తామని ఆయన చెబుతున్నారు. ఈ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నగదు చెల్లింపులకు ఆస్కారం కల్పించామని ఆయన తెలిపారు.
తిరుపతిలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ విధానం వల్ల ఎదురయ్యే ఫలితాలను సమీక్షించి, మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈపాటికి ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
తాజాగా తిరుపతిలో అమలు చేసే ఈ పద్ధతి విద్యుత్ వినియోగదారులకు మేలు చేస్తుందని ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత, తమ పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లా తో పాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కూడా అమలు చేయనున్నట్లు ఆయన చెబుతున్నారు.
Read More
Next Story