‘ఆ బాధ్యత ఈసీదే’.. ఈవీఎంల తీరుపై అంబటి ఫైర్
x

‘ఆ బాధ్యత ఈసీదే’.. ఈవీఎంల తీరుపై అంబటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు పెరుగుతుండటంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల పోలింగ్‌పై కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం(ఈసీ)పైనే ఉంటుందన్నారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు పెరుగుతుండటంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల పోలింగ్‌పై కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం(ఈసీ)పైనే ఉంటుందన్నారు. ఈ అంశంపైనే చర్చించడానికి వైసీపీ ప్రతినిధులు పలువురు కలిసి ఈసీ ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను కలిశాు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, పోలింగ్ శాతాన్ని వేర్వేరుగా ఎందుకు వెల్లడించారో కూడా వివరించాలని కోరారు. ఫారం-20 సమాచారాన్ని ఈసీ వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అన్న వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.

మొదట చంద్రబాబే అన్నారు: అంబటి

ఈవీఎంలు ట్యాంపపరింగ్ చేయబడతాయని మొదటిసారి అన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు అంబటి. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడితే వీవీ ప్యాట్‌లలో కూడా అన్నే చూపాలని, కానీ ఏపీలా మాత్రం అలా చూపడం లేదని ఆరోపించారు అంబటి. ఈవీఎంల పనితీరుపై తమకు ఉన్న అన్ని అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. తమ అనుమానాలకు ఈసీ అతి త్వరలోనే సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పుడు బలం చేకూరింది..

‘‘ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. మాకు ఉన్న అనుమానాలు.. దీంతో బలపడ్డాయి. పోలింగ్ సమయంలో సాయంత్ర ఆరు గంటల తర్వాత కేవలం క్యూలో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఆ టైంలో ఎన్నికల కమిషన్ 68.12 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11:45 గంటలకు 76.5శాతం ఓటింగ్ నమోదైందని, చివరకు 80.66శాతం ఓట్లు పోలయ్యాయని ప్రకటించింది. ఈ అంకెల్లో చాలా తేడా ఉంది. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఈసీ వివరించాలి. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికే అవకాశం కల్పిస్తే దాదాపు 12శాతం వ్యత్యాసం ఎలా వచ్చింది. ఈ అనుమానాన్ని అప్పుడే వెల్లడించినా ఇప్పటివరకు ఈసీ దీనిపై వివరణ ఇవ్వలేదు. అలాగే ఫారం 20లో పార్టీల వారిగా ఓట్లను ప్రకటించాలి. కానీ ఈరోజు ఇప్పటివరకు అలాంటి పని ఏమీ చేయలేదు. ఇది చాలా వింతగా ఉంది’’ అని ఆరోపించారు.

Read More
Next Story