బూత్ ఏజెంట్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
x

బూత్ ఏజెంట్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఎన్నికల వేల పోలింగ్ బూత్‌లలో ఉండే పోలింగ్ ఏజెంట్లు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం కరపత్రాన్ని విడుదల చేసింది. అందులో ఏం పాయింట్లు ఉన్నాయంటే..


ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం అవుతోంది. దీంతో అన్ని పోలింగ్ బూత్‌లను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న ఏర్పాట్ల పనులను వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలకు విఘాతం కలుగకూడదని, పోలింగ్ సమయంలో అల్లర్లు చెలరేగకూడదన్న లక్ష్యంతో అదనపు భద్రతా చర్యలు కూడా పక్డందీగా తీసుకుంటున్నారు. అధికారులు ఈ నేపథ్యంలోనే పోలింగ్ ఏజెంట్లను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో పోలింగ్ ఏజెంట్లకు 14 పాయింట్లను వివరించింది. అవేంటంటే..

1. ఈ ఎన్నికలలో వాడుతున్న EVMలో VSDU (VVPAT స్టేటస్ డిస్ప్లే)

ఉంటుంది

2. VSDUని VVPAT 5తో అనుసంధానం చేయాలి

3. పోలింగ్‌లో CU లేదా BU లో సమస్య వస్తే మొత్తం EVM సెట్‌ను మార్చాలి.

4. EVM సెట్‌ను మార్చినప్పుడు మరోసారి మాక్‌పోల్ నిర్వహించాలి. అందులో ప్రతి అభ్యర్థి ప్రతినిధి ఒక ఓటు వేయాలి.

5. పోలింగ్‌లో VVPATలో సమస్య వస్తే కేవలం VVPAT ని మాత్రమే మార్చాలి.

6. మాక్ పోల్‌లో మొదట VVPATలో 7 ఖాళీ స్లిప్లు పడిన తర్వాత మాక్పోల్ మొదలవుతుంది. ముందుగా అభ్యర్ధులందరూ ఒక్కో ఓటు వేయాలి. మిగిలిన 34 ఓట్లు హాజరైన పోలింగ్ ఏజెంట్లు పంచుకుని తమ ఇష్టానుసారం ఓటు వేయాలి.

PO అభ్యర్థుల వారీగా నమోదు చేసుకున్న ఓట్ల వివరాలు, VVPATలో అభ్యర్ధుల వారీగా వచ్చిన స్లిప్లు, CU డిస్‌ప్లేలో అభ్యర్థుల వారీగా వచ్చిన రిజల్టు కచ్చితంగా సరిపోవాలి. అప్పుడు మాత్రమే EVM లు సరిగా పనిచేస్తున్నట్టు పరిగణించాలి.

7. VVPAT లో 57 స్లిప్స్‌కి వెనుక మాక్‌పోల్ రబ్బర్ స్టాంపు వేసి నల్ల కవర్లో ఉంచి ప్లాస్టిక్ కంటెయినర్లో PINK సీల్ వేసి ఏజెంట్ సంతకంతో భద్రపరచాలి.

8. మాక్ పోల్ చేసిన తరువాత, మాక్ పోల్ ముందు INVALID వస్తే CRD (Close- Result - Clear) .

9. మాక్ పోల్ తర్వాత CRC చేసి వెంటనే CU పవర్ ఆఫ్ చేయాలి.

4 సీల్స్ వేయాలి : 1) గ్రీన్ సీల్, 2) స్పెషల్ టాగ్, 3) Strip సీల్, 4) అడ్రస్ టాగ్ (మొత్తం అన్ని సీల్స్ మీద ఏజెంట్ సంతకం పెట్టవలెను).

10. VVPAT డ్రాప్ బాక్స్‌కి 2 అడ్రస్ టాగ్స్ వేయాలి (టాగ్స్ మీద ఏజెంట్ సంతకం పెట్టాలి).

11. ప్రతి రెండు గంటలకు మొత్తం పోల్ అయిన ఓట్లు చూసుకోవడానికి TOTAL బటన్ వాడాలి.

12. CUలో పవర్ ఆన్ చేయగానే CU, VSDU, VVPATలలో గ్రీన్ లైట్లు వెలుగుతాయి. VVPAT లో 7 స్లిప్‌లు పడటం గమనించాలి.

13. VVPAT లో బ్యాటరీ తేడా వస్తే బ్యాటరీ మాత్రమే మార్చాలి.

14. CU లో బ్యాటరీ తేడా వస్తే బ్యాటరీ మాత్రమే మార్చాలి.

Read More
Next Story