ఏపీలో ఐదుగురు ఐపీఎస్, ఐజీలపై  ఎన్నికల సంఘం వేటు
x
Source: Twitter

ఏపీలో ఐదుగురు ఐపీఎస్, ఐజీలపై ఎన్నికల సంఘం వేటు

ఐదుగురు ఐపీఎస్, ఐజీ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వారిని ఎన్నికలతో సంబంధంలేని పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది.


ఎన్నికల ముందు ఎపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు ఆరుగురు ఐపీఎస్, ఐజీ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారంతా తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. వారిలో గుంటూరు ఐజీ పాలరాజు సహా చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో.. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా కూడా ఉన్నారు. వారు తక్షణమే తమ కింది అధికారులకు బాధ్యతలను అప్పగించాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు వారు విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు వారందరినీ ఎన్నికలతో సంబంధం లేదని పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5గంటలలోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారి భర్తీకి ముగ్గురు అధికారులత ప్రత్యేక ప్యానెల్‌ను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు మరి కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.



Read More
Next Story