జోరుగా ఆంధ్ర ఎన్నికల ప్రచారాలు.. ఈరోజు ఇలా..
x

జోరుగా ఆంధ్ర ఎన్నికల ప్రచారాలు.. ఈరోజు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఏయే నియోజకవర్గాల్లో కొనసాగనున్నాయంటే.. ఏ పార్టీ ఎక్కడ పర్యటించనున్నాయంటే..


ఆంధ్ర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలపై ఫోకస్ పెట్టాయి. ప్రతి రోజూ రెండు మూడు సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నాయి. పార్టీల అధ్యక్షులు రాష్ట్రవ్యాప్త ప్రచారాలపై ఫోకస్ పెడితే.. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కావడానికి ఇంటింటి ప్రచారంలో బిజీ అయిపోయారు. అన్ని పార్టీలది ప్రస్తుతం ఒక నేనినాదం.. గెలుపు మాదే.. ప్రజలు మా వెంటే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం తమ అభిప్రాయాలను రాజుగారి ఖజానా తరహాలో చాలా గుప్తుగా ఉంచారు. అందులో ఆంధ్రలో విజేత ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ప్రతి పార్టీ ప్రచారాలనే ప్రధాన అస్త్రంగా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు ఏ పార్టీ ఎక్కడ ప్రచారం చేయనుందంటే..

వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఈనెల 25న నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఒక్కరోజు విరామం తీసుకుని శనివారం అంటే ఏప్రిల్ 27న తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి ఆయన మరోసారి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సీఎం జగన్.. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో పర్యటించి అక్కడ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో, మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరిలో, మధ్యాహ్నం 3గంటలకు కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గెలుపోటముల నిష్ఫత్తి వంటి అంశాలపై నేతలతో సమావేశం కానున్నారని సమాచారం.

అదే విధంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఈరోజు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 10 గంటలకు విశాఖలో, సాయంత్రం 4 గంటలకు టెక్కలిలో, సాయంత్రం 6 గంటలకు పలాసలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.. ఏప్రిల్ 28న రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఆయన ‘ప్రజాగళం’ బహిరంగ సభలను కూడా నిర్వహించనున్నారు.

Read More
Next Story