ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఇవాళ ఇలా
x

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఇవాళ ఇలా

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు కూడా రోడ్‌షోలు, బహిరంగ సభలతో దూసుకుపోనున్నాయి. ప్రధాన పార్టీలు ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నాయంటే..


ఆంధ్రలో ఎన్నికల ప్రచారాల జోరు మరింత పెరిగింది. ఒకవైపు అన్ని పార్టీల నేతలు ర్యాలీ తరహాలో వెళ్లి నామినేషన్లు వేస్తుంటే మరోవైపు ఆయా పార్టీల అధినేతలు రోడ్‌షోలు, సభలు నిర్వహించి ప్రజలకు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి పార్టీలు కూడా తమ పార్టీ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తెగ కష్టపడిపోతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రచారాల షెడ్యూల్ ఇలా ఉంది.
సీఎం జగన్ ఈరోజు.. యాత్రను రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజపురం నుంచి ప్రారంభిస్తారు. రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట మీదుగా ఉందురుక్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు అచ్చంపేట జంక్షన్ చేరుకుని అక్కడ జిల్లా సిద్ధం సభ నిర్వహించనున్నారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుణి బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్‌ చేరుకెనున్నారు. ఈరోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ఈరోజు కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఆమె ఆలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆదోనిలో, రాత్రి 7 గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
అయితే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చి నామినేషన్ల సమయంలో అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అదే విధంగా ఆయన ఈ నెల 23న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆయన తన నామినేషన్ పత్రాలను పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసరుకు అందించనున్నారు.
Read More
Next Story