చెల్లెలు షర్మిల అన్న జగన్‌పై మరో సారి ధ్వజమెత్తారు. తన రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తారని జగన్‌పై మండిపడ్డారు.
నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా..ఈ రోజుకు నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్‌ను ఇంత వరకు చూడలేదని చెప్పాను. ఈ రోజుకు కూడా తను ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా అదే చెబుతున్నా. ఆ రోజు నా బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పాను. తనకు ప్రభాస్‌తో సంబంధం లేదని, ఈ రోజు కూడా ప్రమాణం చేసి చెబుతున్నా అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జగన్‌కు ఇవన్నీ తెలిసి కూడా తనకు క్యారెక్టర్ లేనట్టు, తనకు ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్టు గత ఐదేళ్లల్లో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపంగా చేయించలేదా అని జగన్‌ను నిలదీశారు. ఇదా చెల్లెలపై ఉన్న ప్రేమ అని జగన్‌ను ప్రశ్నించారు.
రాజకీయాల కోసం ఏదైన చేయడానికి జగన్ సిద్దపడుతారని మండిపడ్డారు. మీకు మీరే సాటని జగన్‌పై ధ్వజమెత్తారు. బాలకృష్ణా ఇంటి నుంచి, ఆ ఐపీ అడ్రెస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, కేసు పెట్టానని, కావాలంటే తన మాటాల్లోనే వినండి అని జగన్మోహన్రెడ్డి చాలా ఎంటర్‌టెయినింగ్ గా ఒక వీడియో క్లిప్‌ను కూడా వేయడం జరిగింది. చాలా సంతోషం. కానీ నీకు నిజంగానే చెల్లెలు మీద ప్రేమ ఉంటే.. చెల్లెపైన తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మి ఉంటే, మీకు తెలిసి ఉంటే.. ఆ హిస్టరీ జరిగిన తర్వాత మీరు ఐదేళ్లు సీఎంగా ఉండి ఏమి గాడిదలు కాసారని జగన్‌ను నిలదీశారు. ఎందుకు బాలకృష్ణ మీద విచారణ జరపలేదని ప్రశ్నించారు. చెల్లెలు మీద ఇప్పుడు ప్రేమున్నట్లు మాట్లాడుతూన్నారే.. ఏ ఇష్యూ మీద బాలకృష్ణ బిల్డింగ్ నుంచి ప్రభాస్‌కు తనకు సంబంధం ఉందని ప్రచారం జరిగిందో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదే ఇష్యూని మీ సాతాను సైన్యం సోషల్ మీడియాలో వాడుకోలేదా అని నిలదీశారు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్‌ను ఇంత వరకు చూడలేదని చెప్పానని షర్మిల స్పష్టం చేశారు.