తనను ప్రేమించలేదనే కసితో ఓ రాక్షసుడు యువతిపై కర్కశంగా దాడికి పాల్పడాడు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమోన్మాదులు రెచ్చి పోతున్నారు. అకారణంగా యువతులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కడప జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో యువతి మరణం నుంచి తేరుకోక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. మరో ఉన్మాది రెచ్చి పోయాడు. తనను ప్రేమించలేదనే కసితో యువతిపై రాక్షసంగా దాడికి పాల్పడ్డాడు. 15 సార్లు కత్తితో దాడి చేశారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అత్యంత దారుణమైన ఈ దుర్ఘటన కడప జిల్లాలోనే చోటు చేసుకుంది. వేముల మండలం కొత్తపల్లికి చెందిన యువతి షర్మిలపై కులాయప్ప అనే దుర్మార్గుడు ఈ దాడికి పాల్పడ్డాడు. నిందితుడు విచక్షణా రహితంగా 15 సార్లు కత్తితో దాడి చేశారు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లితంది. తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితిరాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం రుయా ఆసుపత్రిలో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంటడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలు చెందుతున్నారు. మరో వైపు దాడి తర్వాత నిందితుడు కులాయప్ప పరారయ్యాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపట్టారు. ఇటీవలే కడప జిల్లాలో ఒక దాడి సంఘటన జరిగింది. ప్రెటోల్‌తో దాడి చేసి అగ్గి పెట్టిన ఘటనలో యువతి మృతి చెందింది.

Next Story