ఏపీ ప్రజలకు విపత్తుల సంస్థ వార్నింగ్..
x
Source: Twitter

ఏపీ ప్రజలకు విపత్తుల సంస్థ వార్నింగ్..

ఆంధ్రలో రానున్న రెండు రోజుల్లో 148 మండలాల్లో తీవ్రస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి వరకు వడగాలులు వీయొచ్చని విపత్తుల సంస్థ ఎండీ వెల్లడించారు.


ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వేసవి ప్రారంభం నుంచి పెరుగుతున్న వేడి ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉంటుందని, యువకులు సైతం సొమ్మసిల్లి పోతున్నారని హెచ్చరించారు విపత్తుల సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్. అదే విధంగా ప్రతి రోజు రాష్ట్రంలో వడగాలుల తీవ్రత కూడా పెరుగుతోందని, ఉష్ణోగ్రతతో పాటు ఈ వడగాలులు కూడా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే రేపు దాదాపు 58 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు వీయొచ్చని తమ సంస్థ అంచనా వేసిందని వెల్లడించారు. దాంతో పాటుగా మరో 148 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

ఈ మండలాల్లోనే

శ్రీకాకుళం 17 , విజయనగరం 21, పార్వతీపురం మన్యం 12 , అల్లూరి 6, ఏలూరు 1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయా మండలాల్లోని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూర్మనాథ్ వివరించారు. దాంతో పాటుగా శ్రీకాకుళం 12, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు7, విశాఖపట్నం 3, అనకాపల్లి 18, కాకినాడ 14, కోనసీమ 8, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 10, కృష్ణా 5, ఎన్టీఆర్ 5, గుంటూరు 6, పల్నాడు 11, ప్రకాశం 12, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు1, శ్రీ సత్యసాయి 3, అన్నమయ్య 1, తిరుపతి 3 మండలంలో ఒక మోస్తరు వడగాలులు వీసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారాయన.

శనివారం ఉష్ణోగ్రతలు ఇలా

శనివారం రాష్ట్రంలోని నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైందని, అది రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత అని వెల్లడించారు. ఆ తర్వాత తిరుపతిలోని రేణిగుంట 45.7°C, వైఎస్ఆర్ జిల్లాలోని ఖాజీపేట, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో ఈరోజు 44 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది రాష్ట్రంలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతగా తెలిపారు కూర్మనాథ్.

ఆ సమయంలో పనులు పూర్తి

ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా నీడపట్టున ఉండటానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. అందులో భాగంగానే వీలైనంత వరకు పనులన్నింటిని ఉదయం 11 గంటలలోపు పూర్తి చేసుకోవాలని, లేని పక్షంలో సాయంత్రం 4 గంటల తర్వాత పూర్తి చేసుకోవలని చెప్పారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటున్నందున బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెప్పారు కూర్మనాథ్.

Read More
Next Story