సినబ్బా.. బంగారుకడెం తొడిగేస్తిరా..
పచ్చ నాకు సాక్షిగా కథల సంపుటి రచయిత నామినీని 'మాండలిక బ్రహ్మ' బిరుదు ప్రధానం చేశారు. ఆయన మాండలికానికి స్వర్ణకంకణం తొడిగారు.

నామినికి అవార్డు ఇచ్చిన సందర్భంగా దిగిన ఫొటో
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ )
నిజ్జంగా మట్టి వాసన.. మాండలికం.. పల్లె పదాలతో నిండిందే" ప్రముఖ జర్నలిస్టు, కథా రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు (నామిని) రాసిన పచ్చనాకు సాక్షిగా .. కథల సంపుటి. కళ్ళ ముందు దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించే విధంగా ఉండే ఆ కథల్లోని.. అక్షరానికి పట్టాభిషేకం, మాండలిక బ్రహ్మోత్సవం లాంటిది" అని అభివర్ణిస్తూ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులను సన్మానించారు. నామినీని మాండలిక బ్రహ్మ అవార్డు తో సత్కరించి, స్వర్ణ కంకణం తొడిగారు.
సభలో.. పచ్చ నాకు సాక్షిగా కథల సంపుటి తో పాటు మిట్టూరోడి కథలు, సినబ్బ కథలు, ఇస్కూలు పుస్తకం కథల సంపుటిని గుర్తు చేసుకున్న వ్యక్తులు చిత్తూరు గ్రామీణ మండలికానికి నామిని అక్షర సేద్యం చేశారంటూ, అభివర్ణించారు.
అమరరాజ సంస్థ తరపున రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన సభలో విశిష్ట అతిథి, తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ, "నామిని మాకు మార్గదర్శి. ఆయనను అనుసరించడం కష్టం " అన్నారు. తెలుగు వచన రచనను శాసించిన నామిని ఊహాశక్తి గొప్పది. అని గోరటి వెంకన్న తన మాటల్లో అభివర్ణించారు. .
ప్రముఖ పాత్రికేయుడు తాడి ప్రకాష్ మాట్లాడుతూ… రచయితలకు అభిమానులు ఉంటారు. నామిని కి మాత్రమే ఆత్మాహుతి దళాలు ఉంటాయనన్నారు.. కాళోజీ అభినందనలు అందుకున్నాడు. బాపు మెప్పు పొందాడు. పతంజలి ప్రోత్సాహం తో పచ్చనాకు సాక్షిగా రాయించారు. అందులో ప్రతి వాక్యం చదువుకున్నాం. అప్పటికి పేరున్న గొప్ప రచయితల్ని బయటికి పంపిన వాడు నామిని అని అన్నారు.
" అమ్మ గురించి గొప్పగా రాసిన వాడు నామిని. ఆయన రాసిన మాండలిక భాష మాకు ప్రేరణగా ఉండేది" అని.. దారి చూడు.. దుమ్ము చూడు పాట ఫేం ప్రజా గాయకుడు పెంచల దాసు అంటూ, నామిని ఉన్న కాలం లో ఉండడం మన అదృష్టం అన్నారు.
అంతకుముందు.. సభకు అధ్యక్షత వహించిన భూమన్ మాట్లాడుతూ… "అక్షరానికి పట్టాభిషేకం జరుగుతున్న రోజు, మాండలిక బ్రంహోత్సవం" అని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన పచ్చ నాకు సాక్షిగా కథల పుస్తకాన్ని ప్రస్తావించారు. రాజగోపాల్ నాయుడు ఎంతో అనుభందం ఉంది. రాజకీయ, సాహిత్య, సేవా రంగాలలో అవిశ్రాంతంగా పనిచేశారు. ఇక నామినికి ఈ పురస్కారం ఇవ్వడం మన అదృష్టం అన్నారు.
చివరగా రాజన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గల్లా రామ చంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి, డాక్టర్ గౌరినేని రమాదేవి నామిని దంపతులను మాండలిక బ్రాహ్మ అవార్డు తో స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు.
చివరగా పచ్చ నాకు సాక్షిగా పుస్తక రచయిత, సన్మాన గ్రహీత నామిని మాట్లాడుతూ.. ఈ బిరుదు నా కంటే ముందు తరం రచయితలు గురజాడ, చలం, చాసో, కేశవ రెడ్డి, వంటి ఎందరో ప్రముఖ రచయితలకు చెందుతుంది. అన్నారు. ఈ సభలో.. బొందు రామచంద్ర రెడ్డి ఉద్దీపన గీతం తో సభ ప్రారంభం అయ్యింది. డాక్టర్ సాకం నాగరాజ స్వాగతం పలికారు. సబ్ రిజిస్ట్రార్ కొండారెడ్డి, జీ. కె.యస్. రాజ ప్రసంగించారు. కార్యక్రమం లో నామిని కుటుంబ సభ్యులు, అరసం తిరుపతి జిల్లా ప్రతినిధులు యువశ్రీ మురళి, నేమిలేటి కిట్టన్న, వాకా ప్రసాద్, వేమూరి జయరాం ప్రసాద్, పురందర నాయుడు, గొర్రెపాటి రమేష్, పేరూరు బాల సుబ్రమణ్యం, సాహితీ ప్రియులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Next Story