వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటోను ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు పని కోసం ఆటోలో గార్లదిన్నె వచ్చారు. తిరిగి వెళ్తున్న ఆ ఆటోను ఎదురుగా వచ్చిన ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే రాంజమనమ్మ, బాల గద్దయ్య స్పాట్లోనే మరణించగా, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ పి జగదీష్, డిఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పోలీసులు ఆర్టీసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story