ఓటర్ల తుది జాబితా భేష్‌

సంవిధాన్‌ బచావో ట్రస్టు సుప్రీమ్‌ వేసిన రిట్‌పై తీర్పు వచ్చింది. డూప్లికేట్, ఘోస్టు ఓటర్లను తొలగించడంలో ఎన్నికల సంఘం విఫలమైదనే వాదనను కోర్టు కొట్టేసింది.


ఓటర్ల తుది జాబితా భేష్‌
x
Suprime Court

దేశంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయని సంవిధాన్‌ బచావో ట్రస్టు సుప్రీమ్‌ కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును ఈనెల 12న వెలువరించింది. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ప్రక్రియ, తీసుకుంటున్న చర్యలపట్ల కోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. డూప్లికేట్, ఘోస్టు ఓటర్లను తొలగించడానికి భారత ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోలేదని నిందించే అవకాశం ఏ మాత్రం లేదని సుప్రీమ్‌ కోర్టు భావించింది. ఈ విషయంలో తదుపరి ఆదేశాలు అవసరం లేదని గౌరవ న్యాయ స్థానం భావిస్తూ ఈ పిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీమ్‌ కోర్టు తుది తీర్పులో పేర్కొన్నదని భారత ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఓటర్ల జాబితా తయారీపై సంతృప్తి
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించే విధంగా భారత ఎన్నికల సంఘాన్ని అదేశించాలని కోరుతూ సంవిధాన్‌ బచావో ట్రస్టు సుప్రీమ్‌ కోర్టులో పిల్‌ (రిట్‌ పిటిషన్‌ నెం.1288/2023)ను ధాఖలు చేసింది. ఈ కేసు విషయంలో భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950, ఓటర్ల నమోదు నియమాలు, నిబంధనలు –1960 ప్రకారము స్వచ్ఛమైన సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అనుసరిస్తున్న ప్రక్రియను, తీసుకుంటున్న సమగ్ర చర్యలను సుప్రీం కోర్టుకు వివరించింది. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించండంలో భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వ్యూహాత్మమైన చర్యలు, ప్రక్రియకు భారత ఉన్నత న్యాయ స్థానం సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంవిధాన్‌ బచావో ట్రస్టు పిల్‌ను సోమవారం కొట్టేసింది.
Next Story