ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం నెలకొన్న వాతారణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి 280కిమీ, పుదుచ్చేరికి 320కిమీ, నెల్లూరుకి 370కిమీ మధ్య దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా 15కిమీ వేగంతో ఈ వాయుగుండం కదులుతున్నది. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని తెలిపారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story