ఆంధ్రకు చేరిన ఫ్లెక్సీలు, పోస్టర్ల సంప్రదాయం..
x

ఆంధ్రకు చేరిన ఫ్లెక్సీలు, పోస్టర్ల సంప్రదాయం..

ఆంధ్రలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ఎనిమిది ప్రశ్నలు ఉన్నాయి.


(శివరామ్)

నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా పాపులర్ అయిన పోస్టర్లు, ఫ్లెక్సీల సంప్రదాయం ఇప్పుడు ఆంధ్రకూ విస్తరించింది. ప్రత్యర్ధుల తప్పులు, కుంభకోణాలు, అక్రమాలపై గుర్తు తెలియని వ్యక్తుల పేరిట ఫ్లెక్సీలు వెస్తున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ ఫ్లెక్సీల యుద్ధానికి తెరతీసింది. టీడీపీ అనుబంధ టిఎన్ఎస్ఎఫ్.. వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు అభ్యర్థి, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీయ సత్యనారాయణకు వ్యతిరేకంగా వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. తూర్పు నియోజకవర్గ కేంద్రమైన విశాఖ ఎంవీపీ కాలనీ బస్ కాంప్లెక్స్ ఎదుట ఎనిమిది ప్రశ్నలతో ఫ్లెక్సీలు శనివారం ఉదయం వెలిశాయి. ఆ ప్రశ్నలేంటంటే..

విశాఖలో ప్రభుత్వ, క్రైస్తవ భూములు కొట్టేసింది ఎవరు?

టిడిఆర్ బాండ్లను కొట్టేసింది ఎవరు?

స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్‌కు కారణమైన వ్యక్తి ఎవరు?

స్మశాన స్థలం కబ్జా చేసింది ఎవరు?

అంటూ ఎనిమిది ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వీటిని ఏర్పాటు చేశారు. గతంలో నిరుద్యోగ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెన్ ముట్టడికి ప్రయత్నించి అరెస్టు అయిన ప్రణవ్.. పలు సంచలన కార్యక్రమాలు చేశారు. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రిపై ఎపీపీఎస్సీ అభ్యర్ధులకు అన్యాయం చేశారంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫ్లెక్సీలపై వైపీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story