ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా పని చేశారు. సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు.


మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత రెడ్డి సత్యనారాయణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. వయసు పెద్దది కావడంతో వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆయన అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిద్యం వహించారు. టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన వరుస విజయాలను నమోదు చేశారు. 1983, 1985, 1989, 1994, 1999లో ఐదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు.

రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సత్యనారాయణ మరణం బాధాకరమన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి, రెండు సార్లు మంత్రిగా పని చేసిన సత్యనారాయణ జీవితం నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story