YSRCP| వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు
x
వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి

YSRCP| వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు నమోదైంది. ఎస్సీ,ఎస్టీ వేధింపులు, ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదుకు దారితీసిన పరిస్థితి ఎందుకంటే..


చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ (sc, st atrocity) తోపాటు ఫోక్సో (foxo) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిపై అత్యాచారం జరిగినట్లు ప్రచారం చేయడం ద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ఓ దళిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి (చిత్తూరు) జిల్లా ఎర్రావారిపాలెం పోలీసులు కేసు నమోదు చేశా. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు ఇంకొందరిని కూడా కేసులో చేర్చారు.

చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం యలమంద గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని బడి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీనిపై, అనవసర రాద్ధాంతం చేశారని బాలిక తండ్రి పోలీసులకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వివరాలు పరిశీలిస్తే...
ఈనెల 4వ తేదీ తిరుపతి జిల్లా ఎర్రపారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విచారణ పూర్తయ్యే వరకు నిరాధార వార్తలు ప్రచారం చేయవద్దని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు తోపాటు ఎర్రావారిపాలెం పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజే జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్వయంగా రంగంలోకి దిగి బాలికను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరుపై కూడా ఆయన వివరాలు సేకరించారు.
"నేను బడి నుంచి వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు.ప్రేమించాలంటూ, బెదిరించారు"అని ఆ విద్యార్థిని చెప్పినట్లు సమాచారం. "తనపై దాడి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నంలో గాయాలయ్యాయి" అని ఆ విద్యార్థిని కూడా దర్యాప్తులో చెప్పినట్లు ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. దీంతో..
దాడికి గురైన ఆ విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతిలోని టీటీడీ పద్మావతి ఆసుపత్రికి తరలించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదు అని వైద్యులు కూడా నిర్ధారించిన విషయాన్ని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఇదిలావుంటే..
ఈ సంఘటన జరిగిన రోజు, తరువాత కూడా వైసీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియా ద్వారా చేసిన ప్రచారం తమ కుటుంబం ప్రతిష్ట, గౌరవానికి భంగం కలిగిందని ఆ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా, దళితులు అది కూడా బాలిక అని కూడా మరిచిపోయి, అత్యాచారం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారం చేశారనే బాలిక తండ్రి ఫిర్యాదుతో ఎర్రావారిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ (crime number) 58/2024తో 352, 351 (2),196(1),61(2),353(1),72(2) rw 3(5) BNS,67A ITA-2000-2008,23(1) POCSO ACT 2012,3(1)(z)(zc) SC ST చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎర్రవారిపాలెం పోలీసులు తెలిపారు.
Read More
Next Story