స్నేహితుడా.. మళ్లీ ఎప్పుడొస్తావు...
x
నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు భౌతికకాయం పేటిక మోస్తున్న ఎమ్మల్యే పులివర్తి నాని, బంధువులు

స్నేహితుడా.. మళ్లీ ఎప్పుడొస్తావు...

నా గురువు నారా రామ్మూర్తి. ఆయనతో స్నేహం. రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేస్తమా మళ్లీ మాకోసం వస్తావా? అని కన్నీరుమున్నీరయ్యారు.


కష్టసుఖాల్లో అండగా ఉండేది స్నేహితుడు. స్నేహానికి మించిన బలం మరొకటి ఉండదు. స్నేహితం అనేది ఓ బలమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం ఉండదు. మేలు చేసిన వారిని మరవకూడదు అనేది స్నేహితం నేర్పిస్తుంది. బంధువులు లేని వారు ఉండొచ్చేమో! కాని స్నేహితుడు లేని వారు ఉండరు. రాజకీయాల్లో కూడా ఓ గురువు ఉంటారనడంలో అతిశేయోక్తి కాదు. ఈ రెండు గుణాలతో అనుబంధం ఏర్పరుచుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని (వెంకటమణి ప్రసాద్) వేదనకు గురయ్యారు.


మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు (72), చంద్రగిరి ఎమ్మెల్యే పులివరి నాని (53) వారద్దరికి వయసులో చాలా తేడా ఉంది. యువకుడిగా ఉన్నప్పటి నుంచి టీడీపీ రాజకీయాల్లో నారా రామ్మూర్తి నాయుడుతో నానికి సంబంధాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో సమస్యలు, పార్టీ వ్యవహారాల్లో రామ్మూర్తితో కలసి పయనించిన వారిలో ఎమ్మెల్యే నాని ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరని చెబుతారు. దీంతో తనకు రాజకీయమార్గం చూపించిన వ్యక్తిగా రామ్మూర్తిని గురువుగా భావిస్తారు.


"నాకు స్నేహితుడు, గురువు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు. భౌతికంగా దూరమైన రాజకీయ గురువును తలుచుకుని ఎమ్మల్యే నాని నాని తల్లడిల్లారు" సీఎం చంద్రబాబు మదిలో ఎలాంటి వేదన ఉందో తెలియదు. కానీ, పులివర్తి నాని శనివారం నుంచి తన వేదనను ఆత్మీయులు, టీడీపీ శ్రేణుల వద్ద తలుచుకుని వేదనకు గురవుతున్నారు. రామ్మూర్తి భౌతికకాయం ఉన్న వాహనంలోనే నారావారిపల్లెకు చేరుకున్నారు. గురువుకు అంతిమవీడ్కోలు పలకడానికి చివరి క్షణాల్లో కూడా వెంట ఉండాలనే ఆయన మాటలు, చేతల్లో కనిపిపించింది.

అందరికంటే ముందే..

అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని చూడడానికి కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్న వారిలో పులివర్తి నాని కూడా ఒకరు. ఆదివారం ఉదయం అందరికంటే ముందుగానే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానాశ్రయం నుంచి రామ్మూర్తి పార్థివదేహాన్ని బయటికి తీసుకురాగానే కన్నీరు మున్నీరయ్యారు. టీటీడీ సమకూర్చిన రామ్మూర్తి భౌతికకాయాన్నిఅంబులెన్సులో ఎక్కించారు. తన స్నేహితుడు, గురువును స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకుని వెళుతున్నట్లు భావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆ అంబులెన్స్ లోనే బయలుదేరారు. నారా రామ్మూర్తి నాయుడు భౌతికంగా లేకున్నా, ఆయన సాంగత్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాఠాలు నేర్చుకున్నాం. రాజకీయంగా కూడా ఎదగడానికి రామ్మూర్తి వెంట నడిచిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అని ఎమ్మెల్యే పులివర్తి నాని గద్గద స్వరంతో చెప్పారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఏమన్నారంటే.. "మా అందరికీ మార్గదర్శి. నాకు రాజకీయ గురువు. రాజకీయాల్లో మొదటి నుంచి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు" అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గుర్తు చేసుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
Next Story