మళ్లీ టీడీపీ గూటికి చేరిన  గండి
x
Source: Twitter

మళ్లీ టీడీపీ గూటికి చేరిన 'గండి'

సీటు దక్కలేదన్న మనస్తాపంతో రాజీనామా చేసిన 'గండి' తిరిగి టిడిపి గుటికే చేరారు... ఎందుకో...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: గోరింక గూటికే చేరావే చిలక... ఈ పాట అందరికీ తెలిసిందే. అలిగి వెళ్లిన చిలక తిరిగి గోరింక గూటికే చేరినట్టు... సీటు దక్కలేదన్న మనస్తాపంతో రాజీనామా చేసిన గండి బాబ్జి తిరిగి టీడీపీలోకే చేరారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్, టీడీపీ అధిష్టానం బుజ్జగింపులు ఫలించాయి. దీంతో ఆవేశంగా రాజీనామా చేసిన గండి బాబ్జి ఆలోచించి దాన్ని వెనక్కి తీసుకున్నానని ప్రకటించారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లను కలిసి ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పాటుపడతానని హామీ కూడా ఇచ్చేశారు.

దక్షిణం టీడీపీలో చల్లారిన అసంతృప్తి...

విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి చల్లారింది. తనకు సీటు దక్కలేదన్న అసంతృప్తితో రాజీనామా చేసి పార్టీని వీడిన గండి బాబ్జిని బుజ్జగింపులతో తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ గండి బాబ్జికి ఆశ చూపించారు. రాజీనామా ఉపసంహరించుకున్న తర్వాత విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జి పదవి ఇచ్చారు. దీంతో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు గండి బాబ్జి. దక్షిణంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణకు కూడా సహకారం అందిస్తానని తెలిపారు. దీంతో దక్షిణ టీడీపీలో సమీకరణాలు ఓ కొలిక్కి వచ్చాయి.

Read More
Next Story