అయ్యయ్యో, గంటా.. సీటు పోయేలా ఉందే!
x
Source: Twitter

అయ్యయ్యో, గంటా.. సీటు పోయేలా ఉందే!

భీమిలినా… చీపురుపల్లినా… ఇంకా తేల్చని అధిష్టానం... అయోమయంలో గంటా క్యాడర్...భీమిలి టికెట్ ఇస్తారంటూ హడావుడి... భీమిలి టిక్కెట్టు ‘గంటా’కేనా...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడు గంటా శ్రీనివాసరావు భవితవ్యం క్వశ్చన్ మార్క్‌లా మారింది. పోటీ చేసిన ప్రతిచోటా తిరుగులేని విజయం సాధించుకున్న ఈ నేతకు, ఇప్పటివరకు టికెట్ ఖాయం అవలేదు. టీడీపీ అధిష్టానం మూడో జాబితాలో కూడా గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నాలుగో జాబితాలో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

సర్వేతో సీటు దక్కుతుందా...?

గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖాయం అయ్యేలా ఉందని, ఇదే విషయం సర్వేల్లో తేలిందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధిష్టానం గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయమని స్పష్టం చేయడం జరిగింది. కానీ గంటా శ్రీనివాసరావు తనకు పరిచయం లేని నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశారు. ఎన్నికలు చూస్తే సమీపిస్తున్నాయి. దీంతో ఇంకా గంటా టికెట్ గురించి అధిష్టానం ఎటు తేల్చలేదు. ఈ నేపథ్యంలో గంటా కేడర్ అయోమయంలో పడింది. తాజాగా భీమిలి టికెట్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది. మరి ఇప్పటికైనా గంటా శ్రీనివాసరావుకు సీటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.

ప్రత్యర్థి రెడీ....

భీమిలి నియోజకవర్గం నుంచి ఇప్పటికే అధికార వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావును బరిలోకి దించింది. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావుకు సీటు దక్కితే... ఆ నియోజకవర్గంలో ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం... సీనియారిటీలోనూ అంగ, అర్థబలాలోనూ సమవుజ్జీలు కావడంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగబోతోంది.

Read More
Next Story