తిరుమల గరుడ సేవకి భారీగా రద్దీ
x

తిరుమల గరుడ సేవకి భారీగా రద్దీ


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు నేడు రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవ్వనునారు .గరుడ వాహనంపై విహరించనున్న శ్రీవారికి మూలవిరాట్ కు అలంకరించే సహస్ర నామాల మాల, లక్ష్మీ కాసుల మాల, పచ్చల హారం స్వామి వారికి అలంకరిస్తారు పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్తున్నాడు.




అందుకే శ్రీవారిని గరుడ వాహనం రోజు దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు.గరుడ వాహన సేవ జరుగుతున్న నేపథ్యంలో ఆలయ మాడవిధుల్లోని గ్యాలరీలు నిండు కుండలా మారుతున్నాయి. ఇప్పటికే గ్యాలరీలలో లక్ష మందికి పైగా భక్తులు చేరుకున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. ఆలయ మాడవిధుల్లోనూ. ఔటర్ రింగ్ రోడ్డులలోకి భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. ఇక తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిండి తిరుమలకు చేరుకుంటున్నాయి.గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయణంగా అన్నప్రసాద వితరణ సాగుతూ వస్తుంది. చంటి పిల్లలకోసం పాలను సైతం టీటీడీ గ్యాలరీలలో అందిస్తుంది. ఇక 3 లక్షలకు పైగా గరుడ వాహన సేవకు భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి టీటీడీ తీసుకొచ్చింది.


Read More
Next Story