జగన్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. వైపీపీ ఆఫీసుపై బీజేవైఎం దాడికి యత్నం..
x

జగన్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. వైపీపీ ఆఫీసుపై బీజేవైఎం దాడికి యత్నం..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుపతి తిరుపతి ప్రసాదం వివాదానికి సంబంధించి బీజేవైఎం కార్యకర్తలు.. జగన్ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో జగన్ ఆడుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే జరగడంతో ఇందుకు జగన్ బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని.. బీజేవైఎం కార్యకర్తలను చెదరగొట్టారు. వారిలో పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా వైసీపీ కేంద్ర కార్యాలయంపై కూడా బీజేవైఎం కార్యకర్తలు దాడికి ప్రయత్నించాయి. కార్యాలయంలో వెళ్లడానికి బలప్రయోగం కూడా చేశారు. కార్యాలయ గోడలపై రాళ్లు, రంగు డబ్బాలు విసిరారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బంది, పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించారని వైసీపీ శ్రేణులు వెల్లడించారు. ఈ దాడిలో భాగంగా వైసీపీ కార్యాలయ భద్రతా సిబ్బంది గదిని పూర్తిగా ధ్వంసం చేశారని వైసీపీ శ్రేణులు చెప్పాయి. దీనంతటికీ చంద్రబాబే కారణమని కూడా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు..

తిరుపతి లడ్డూ ప్రసాద కల్తీ అంశంపై బీజేపీ యువ మోర్చ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న అప్పటి ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు తాడెపల్లిలోని జగన్ నివాసం, వైసీపీ కార్యాలయాల దగ్గర ఆందోళన తెలిపారు. ఈ సందర్బంగానే వైవీ సుబ్బారెడ్డి డౌన్ డౌన్, వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు ముందు బైఠాయించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ క్షమాపణలు చెప్పేవరకు తాము తమ ఆందోళనలు విరమించుకోమంటూ బీజేవైఎం స్పష్టం చేసింది. ఈ సందర్బంగానే జగన్ దిష్టి బొమ్మను కూడా దగ్దం చేశారు బీజేవైఎం కార్యకర్తలు.


ఇదే బాబు పైశాచికత్వం: వైసీపీ


వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కావడంతో జగన్ ఇంటి ముందు బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వస్తున్న వార్తలపై వైసీపీ ఘటుగా స్పందించింది. తమ ప్రభుత్వంపై బుదరజల్లడానికే చంద్రబాబు ఇలాంటి రాతలు రాయిస్తున్నారని అన్నారు. ‘‘అక్రమ డిపాజిట్ల వీరుడా, చిట్టీల వసూలు రాజా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లను గుర్తించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో. గత ప్రభుత్వం అని రాసి వాళ్లు ఇప్పుడు పైశాచిక ఆనందం పొందవచ్చునేమో కాని, నిజాలను బంధించలేరు’’ అని వైసీపీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టింది. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా వైసీపీపై తోసేసి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని, కూటమిలో భాగమైన బీజేపీ యువ మోర్చను కూడా తన కుట్రపూరిత రాజకీయాల కోసం వినియోగించుకున్న నేత చంద్రబాబు అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Read More
Next Story