తుపాను నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్‌ కళాశాలకు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్‌ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్‌ డా ఎస్‌ వెంకటేశ్వర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్‌ కళాశాలలకు, ఎయిడెడ్‌ యాజమాన్యాల పరిధిలో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్‌ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్‌ 14న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story