హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం.. నిద్రమత్తే కారణమా..
x

హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం.. నిద్రమత్తే కారణమా..

హోం మంత్రి వంగలపుడి అనితకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఎస్కార్ట్‌లో ఆమె ఉన్న కారుకు ప్రమాదం జరిగింది.


హోం మంత్రి వంగలపుడి అనితకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఎస్కార్ట్‌లో ఆమె ఉన్న కారుకు ప్రమాదం జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు.ఎవరికీ ఏమీ కాలేదు. వాహనాలకు స్వల్ప నష్టం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయి.. అనితను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెకు ఏమీ కాలేదని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం సమీపంలో ఈ ప్రాదం జరిగింది. ఆమె విజవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వెళ్తుండగా మార్గమద్యలో ఈ ప్రమాదం జరిగింది.

అసలేం జరిగిందంటే..

వంగలపూడి అనిత తన ఎస్కార్ట్ వాహనంలో విజయవాడ నుంచి పశ్చిమగోదావరి అలంపురంకు బయలుదెరారు. ప్రయాణం అంతా సాఫీగానే సాగుతోంది. ఇంతలో ఆమె ఎస్కార్ట్‌కు ఒక్కసారిగా బైక్ అడ్డువచ్చింది. దీంతో బైక్‌ను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దానిని గమనించి ఎస్కార్ట్ వాహనంలోని డ్రైవర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఎస్కార్ట్ వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. వెంటనే బయటకు దిగి అందరి పరిస్థితులు తెలుసుకున్న వెంటనే అనిత.. వేరే వాహనంలో పశ్చిమగోదావరికి వెళ్లారు.

ప్రమాదానికి కారణం ఏంటి..

హోం మంత్రికి వంగలపుడి అనిత కాన్వాయ్‌కి జరిగిన ప్రమాదంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కాగా ఈ ప్రమాదానికి హోం మంత్రి వాహన డ్రైవర్ ఏమరపాటు కారణమా లేకుంటే బైక్‌పై వస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే ఈ ప్రమాదంపై అనిత ఏమీ మాట్లాడలేదు. తన డ్రైవర్లకు మాత్రం ఎప్పుడైనా ప్రయాణాలు చేసే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, మన నిర్లక్ష్యం వేరే వాళ్లకు బాధ కలిగించే ప్రమాదం ఉంటుందని సున్నితం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Read More
Next Story