సొంతింటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం.. అర్హులెవరు.. ఎవరు అప్లై చేసుకోవాలంటే..
x

సొంతింటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం.. అర్హులెవరు.. ఎవరు అప్లై చేసుకోవాలంటే..

సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటున్న ఆంధ్రుల కలను నెరవేర్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.


సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటున్న ఆంధ్రుల కలను నెరవేర్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాయి. ఇకపై రాష్ట్రంలో సొంతిల్లు నిర్మించుకోవాలని ఆశపడే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిశ్చయించుకున్నాయి. ఈ ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) 2.0 పథకం కింద అందించనున్నాయి. తాజాగా ఈ పథకం మార్గదర్శకాలను విడుదల చేశారు అధికారులు. ఈ పథకం అమలుకు ప్రతి రాష్ట్రం తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పథకానికి సంబంధించి డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం పంపించేసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షల ఆర్థిక సాయం అందనుంది. వీటిలో కేంద్ర వాటా రూ.2.5 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు అని సర్కాన్ తమ డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌లో తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో అర్హులు

పట్టణ ప్రాంతాల్లో ఉండే లబ్దిదారుకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా సొంతిల్లు, సొంత స్థలం ఉండకూడదు. అదే విధంగా ఇతర ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో లబ్దిదారు అయి ఉండకూడదు. లబ్దిదారు వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండకూడదు. కాగా లబ్దిదారుకు 2.5సెంట్ల వెట్ ల్యాండ్ లేదా 5సెంట్ల డ్రైల్యాండ్ ఉన్నా ఈ పథకాన్ని పొందవచ్చు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ పథకానికి అర్హులను ఎన్నుకుంటారు. లబ్దిదారుడి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డ్ ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడా సొంతిల్లు, ఇంటి స్థలం ఉండకూడదు.

ఈ పథకాన్ని పొందడానికి లబ్దిదారు.. ఆధార్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, తెల్ల రేషన్ కార్డు, నో హౌస్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ స్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌ను సంప్రదించాల్సి ఉంది. దాంతో పాటుగా 1902 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి, helpdesk.apshcl@apcfss.in కు ఈమెయిల్ పంపడం ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read More
Next Story