అంబుజా సిమెంట్స్  వస్తే విశాఖకు అన్నీ తిప్పలే!
x

'అంబుజా సిమెంట్స్ ' వస్తే విశాఖకు అన్నీ తిప్పలే!

ఆవేళ విశాఖ సిమెంట్స్ కి 'నో' చెప్పి ఇప్పుడెలా అనుమతి ఇస్తారని ప్రశ్నించిన హెచ్ఆర్ఎఫ్


విశాఖ జిల్లా, పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు వల్ల వచ్చే వాయు, జలకాలుష్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) పిలుపిచ్చింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు ఎం.శరత్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇలా ఉంది.

"ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు వాటి లాభం కోసం మాత్రమే కాకుండా, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రత, జీవవైవిధ్యం, భూగర్భజలాల సంరక్షణ కూడా ముఖ్యమైన అంశాలు గా పరిగణించాలి. దురదృష్ట వశాత్తు మనదేశం లో ఈ పరిస్థితులు లేవు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు జీవించే హక్కుపై దుర్మాగర్గమైన దాడి చేస్తూనే వున్నాయి. విశాఖజిల్లా పెదగంట్యాడ, గంగవరం,కుర్మన్నపాలెం పరిసర ప్రాంతాల ప్రజలు అదానీ పోర్ట్ ,NTPC , హిందుజా పవర్ ప్లాంట్ , ఫార్మాసిటీ వంటి పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్నారు. అలాంటి రసాయనాల కుంపటిపై మరో సిమెంట్ కర్మాగారం నిర్మించాలనే ఆలోచనే దుర్మార్గం" అని మానవహక్కుల వేదిక అభిపాయపడింది. ఈ ప్రాంతాలు ఇప్పటికే తీవ్ర వాతావరణ, వాయు, నీటి, భూమి కాలుష్యాలతో బాధ పడుతున్న ప్రాంతాలుగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో, మరొక భారీ బొగ్గు ఆధారిత పరిశ్రమ స్థాపించేందుకు అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల, జీవహక్కులకు విరుద్ధమని HRF ఆరోపించింది.
వాయు కాలుష్య స్థాయి పెరుగుతోంది...
విశాఖపట్నంలో real-time వాయు నాణ్యత (AQI) బాగా క్షీణించింది. విశాఖపట్నం దేశంలో రెండవ హానికర స్థాయిలో ఉంది. ఈ వాయు కాలుష్య స్థాయిలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించే స్థాయి కంటే చాలా అధికంగా ఉన్నాయి. ఇది శ్వాసకోశ రోగాలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, అల్జీమర్స్, హృద్రోగాల అవకాశాలు పెంపొందించవచ్చు.
హిందూజా (HNPCL) 1040 MW థర్మల్ పవర్ ప్లాంట్ — పరిసర కాలుష్యం CPCB నిబంధనల ఆధారంగా, ఈ సమీప విద్యుత్ ప్లాంట్‌ను PM (particulate matter) తగ్గించే ఎలెక్ట్రోస్టాటిక్ ప్రీసిపిటేటర్లు (ESP), SO₂ వాయువులను తగ్గించుటకు FGD (Flue Gas Desulfurization) యంత్రాంగాలు అమర్చమని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇవేవి మచ్చుకు కూడా ఎక్కడా కనిపించవు. పబ్లిక్ సంస్థ అయినా NTPC కూడ పెద్దగా మినహాయింపు కాదు.
ఇక గంగవరం పోర్టు నిర్వాకం చెప్పనలవి కాదు. ఇక్కడ 20 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన రెండు మెకానికల్ కోల్ టెర్మినళ్లు, సౌత్ ఆఫ్రికన్ స్టింకోల్ బల్క్ , వంగవిల్లి అన్వాష్డ్ కోకింగ్ కోల్ ప్లాంట్ , గూంయేళ్ల నాన్ కోకింగ్ కోల్ వంటి సుమారు ఎనిమిది కోల్ బెర్తులు ఉన్నాయి, ఇక్కడ లక్షలాది టన్నుల బొగ్గును నిలువ చేస్తారు.
ఇదంతా భూగర్భాన్ని , భూ ఉపరితలాన్ని కూడ కలుషితం చేసే విషమే . ఇవికాక నైట్రోజన్ అమ్మోఅనియం సల్ఫయిట్ వంటి విషపూరిత నిల్వలు ఫార్మాసిటీ కోసం దిగుమతి అవుతున్నాయి. కోరమాండల్ వంటి వాటికీ అవసరమైన ఫెర్టిలైజర్స్ కూడ ఇక్కడే నిల్వ అవుతున్నాయి. ఇవన్నీ భూగర్భాని నాశనం చేసి ఇప్పటికే ఈ ప్రాంతవాసులకు ప్రాణాపాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గంగవరం పోర్ట్ విస్తరణ వలన ఇవన్నీ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఆరోగ్య గణాంకాలు, ప్రభావాలు
ప్రత్యేకంగా ఈ పరిధిలో జరిగిన సర్వేలు, పాఠశాల పరీక్షలు, హాస్పిటల్ రిపోర్ట్ ల నుండి ప్రాచుర్యం పొందిన డేటా సాధారణ ప్రజలకు అందుబాటులో చాలా పరిమితంగా ఉంటుంది. కానీ సాధారణ మానవ ఆరోగ్య పరిశోధనలు, వాయు కాలుష్య పరిశోధనలు పలు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాంతాలలో అనేక ప్రతికూల ప్రభావాలు చూపిచున్నాయి.
వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు (ధూళితో మొండిరోగం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, దెబ్బతిన్న ఊపిరితిత్తుల సామర్ధ్యం) చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
పిల్లలలో ఎముక పెరుగుదల, శరీర బలం, ఊపిరితిత్తు సామర్థ్యం క్షీణించే అవకాశం ఉంటుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చు. ఇది కాకుండా, ఇతర రుగ్మతలు — అలర్జీలు, కంటి ఇబ్బందులు, చెవి, చర్మ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో మరో భారీ బొగ్గు ఆధారిత సిమెంట్ పరిశ్రమ స్థాపించడం అనేది ప్రజల ఆరోగ్య హక్కులకు, మానవ హక్కులకు, పర్యావరణ హామీలకు ఘోర విరుద్ధమైన చర్యగా భావించాలి. అసలు ఈ ఆలోచనే అత్యంత దుర్మార్గమైన ఆలోచనగా HRF అభిప్రాయపడుతోంది. గతంలో విశాఖ ఉక్కు కర్మాగార- సిమెంట్ ప్రాజెక్ట్‌కి పర్యావరణ అనుమతులు రాకుండా నిరాకరించిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని అదానీ కంపెనీకి ఇచ్చిన అన్ని అనుమతులు వెంటనే రద్దు చేయాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేసింది.
Read More
Next Story