అనుభవంతో పాటు పార్టీకి పరిగెత్తే యువ రక్తం అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సీనియర్‌ పొలిటీషియన్‌. ఆ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. ప్రధాని మోదీతో సహా ఇతర రాజకీయ నాయకులందరూ తన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారని ఇది వరకు ఓ సందర్భంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ వెల్లడించారు. అంత సీనియర్‌ పోలిటీషియన్‌ అయిన చంద్రబాబుకు ఇటీవల దైవ భక్తి కూడా బాగా పెరిగింది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తన భార్య భువనేశ్వరితో కలిసి తీర్థ యాత్రలు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతంపైన కూడా సీఎం చంద్రబాబుకు నమ్మం ఉన్నట్లు తన మాటల్లో వ్యక్తం అవుతోంది. పూర్వ జన్మ పుణ్యం, పాపం గురించి ప్రస్తావిస్తూ కర్మ సిద్ధాంతంపై తనకు నమ్మం ఉందనే విషయాన్ని వెల్లడించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ప్రజలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని, దీని వల్ల గత 41 ఏళ్లుగా తాను అసెంబ్లీకి వెళ్తున్నానని మాట్లాడిన సీఎం చంద్రబాబు, దీని వల్ల ఎవరకీ దక్కని ఇలాంటి అరుదైన గౌరవం తనకు దక్కిందని, ఇది తన పూర్వ జన్మ పుణ్యమని పేర్కొన్నారు. పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నందు వల్లే తనకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కిందని చెబుతూ.. తనకు కర్మ సిద్ధాంతంపై కూడా నమ్మం ఉందనే విశ్వాసాన్ని వెల్లడించారు.

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శనివారం తణుకులో పర్యటించారు. అక్కడ ప్రజావేదిక నిర్వహించిన అనంతరం తణుకు అసెంబ్లీ నియోజక వర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తణుకు నూలి గ్రౌండ్స్‌లో టీడీపీ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో తనతో పాటు టీడీపీ శ్రేణులందరూ అనేక కష్టాలు పడ్డారని, ఇలా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్ట నష్టాలు తలెత్తినా టీడీపీ శ్రేణులు ఎప్పుడు అధైర్య పడలేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని అన్నారు. అన్ని కష్టాల్లోను, నష్టాల్లోను కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, ఎప్పటికప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసమే జనసేనతో, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎంగా ఉండి అనేక కష్టాలు చూస్తున్నానని, ముఖ్యమంత్రి అంటే అనుభవించడం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని చాలా మంది అడుగుతున్నారని, దానికి ఒకటే మార్గమని, ఒకటి పారిపోవడం, రెండోది ఫైట్‌ చేయడమని, అయితే తాను ఫైట్‌ చేయడాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
అనుభవంతో పాటు పార్టీకి పరిగెత్తే యువ రక్తం అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అభ్యర్థుల ఎంపి చేపట్టామని, టిక్కెట్లు కేటాయించామన్నారు. పార్టీ కేడర్‌ను బలోపేతానికి పని చేయాలని, అలా కాకుండా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తే ఒకటి రెండు సార్లు చూస్తానని, తర్వాత సీనియర్‌గాసే చర్యలు తీసుకుంటానని టీడీపీ శ్రేణులకు హెచ్చరించారు. టీడీపీ శ్రేణులకు సంబందించిన కాంట్రాక్ట్‌ బిల్లులు ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే వాటిని విడుదల చేయించాల్సిన బాధ్యతలు మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మహానాడు ప్రస్తావన కూడా చేశారు. టీడీపీ పుట్టిన తర్వాత మొదటి సారి కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2029 ఎన్నికలు లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని దిశా నిర్ధేశం చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించేది, నడిపించేది బలహీన వర్గాలు మాత్రమే అని వెల్లడించారు.
Next Story