నేనున్నా.. మీకు అండగా ఉంటా...
తమ్ముడు రామ్మూర్తి కొడుకులను సీఎం చంద్రబాబు అక్కున చేర్చుకున్నారు. తండ్రి లేని లోటు లేకుండా చూసుకుంటాననే భరోసా ఇచ్చినట్లు కనిపించింది.
తమ్ముడు రామ్మూర్తి మరణాన్ని సీఎం చంద్రబాబు జీర్ణించుకోలేకపోత్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శ్వాస విడిచిన తమ్ముడు పార్థివదేహాన్ని చూడగానే చంద్రబాబు వదనం విషాదంతో నిండిపోయింది. తన్నుకు వస్తున్న కన్నీటిని కూడా బలవంతంగా అదిమి పెట్టుకున్నట్లు ఆయన కళ్ళే చెబుతాయి. అదే సమయంలో తండ్రి రామ్మూర్తి భౌతికకాయం వద్ద ఉన్న కొడుకులు నారా రోహిత్, నారా గిరీష్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. తనలోని బాధను కూడా గుండెల్లోనే అదిమి పట్టుకున్న చంద్రబాబు తమ్ముడు కొడుకులు ఇద్దరిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.
" మీకు నేనున్నా. అధైర్య పడవద్దు" అని సాంత్వన మాటలతో ధైర్యం చెప్పారు. బెడ్ పై నిర్జీవంగా ఉన్న తమ్ముడి భౌతిక కాయం. తన దగ్గర ఉన్న ఇద్దరి కొడుకులను సముదాయించే సందర్భంలో ఆయనకు గత జ్ఞాపకాలు మదిలో మేదిలినట్లు కనిపించింది.
చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978 మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, విజయం సాధించారు. కొందరు నాయకులు, మదనపల్లె పట్టణంలో ఆయన సామాజిక వర్గ నేతలు కూడా ఆర్థికంగా సహాయం అందించారనేది సన్నిహితులు చెప్పుకుంటూ ఉంటారు. మదనపల్లి నుంచి నారాయణప్ప నాయుడు ఈయనకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచి వారిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయనతోపాటు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గంధమనేని రమేష్ చంద్రప్రసాద్, అండగా నిలిచారు (ఇటీవల ఆయన మరణించారు). స్నేహితుల పరిస్థితి అలా ఉంటే, అన్న చంద్రబాబు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి మండలంలో యాక్టివ్ గా ఉండేవారు. సమస్యలు అన్న దృష్టికి తీసుకుపోవడం. లేదంటే అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి చొరవ తీసుకునే వారిని ఆయన సన్నిహితులు చెబుతారు.
తాను హైదరాబాదులో ఉన్నా, స్థానికంగా తన తమ్ముడు రామ్మూర్తి పరిస్థితులు చక్కదిద్రంలో చేదోడుగా మెలిగిన విషయాలను చంద్రబాబు మదిలో మెదిలినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా 1999 వరకు కూడా రామ్మూర్తి వల్ల చంద్రబాబు ఇబ్బంది పడిన పరిస్థితులు లేవు. తాను సీఎం గా ఉన్నప్పుడు కూడా తన పేరు ఉపయోగించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలు ఎక్కడా లేకపోవడం కూడా చంద్రబాబుకు గుర్తుకు వచ్చినట్లే ఆయన ప్రస్తుత మానసిక పరిస్థితి చెప్పకనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో..
సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి కొడుకులు రోహిత్, గిరీష్ ను దగ్గరికి తీసుకున్న వారిని సముదాయిస్తూనే గతాన్ని గుర్తు చేసుకున్నట్లే వాతావరణం కనిపించింది. రామ్మూర్తి పార్థివదేహం వెంట కొడుకు నారా లోకేష్, భార్య భువనేశ్వరి, నందమూరి కుటుంబం నుంచి రామకృష్ణను వెంట ఉంచి రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి భౌతికకాయాన్ని తీసుకువచ్చి, తమకు జన్మకు ఇచ్చిన ఇంటి వద్ద ఉంచారు.
కుటుంబ సభ్యులు ముందుగానే నారావారిపల్లెకు చేరుకున్నారు. ఒంటరిగా సీఎం చంద్రబాబు ఆదివారం 10 గంటలకు నారావారిపల్లి లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్జీవంగా ఉన్న తమ్ముడు రామ్మూర్తి భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ సమయంలో కూడా..
తమ్ముడు రామ్మూర్తి కొడుకులు నారా రోహిత్, గిరీష్ ను పక్కనే కూర్చున్నారు. తమ్ముడు ఇక లేడు. రాడు. రాలేడనే గుండెల్లో బాధను నింపుకున్న చంద్రబాబు పడుతున్న మనోవేదనను చూసి, బంధువులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో కూడా నారా లోకేష్ కంటే తమ్ముడి కొడుకులని దగ్గర ఉంచుకున్నారు. మీ బాధ్యత నాదే అన్నట్లు వారికి భరోసా ఇస్తున్నట్లే కనిపించింది. చంద్రబాబు తమ్ముడి శకపేటిక చెంతనే కూర్చున్నారు. బాబాయ్ అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ, తమ్ముళ్లు నారా రోహిత్, గిరీష్కు అండగా నిలిచారు. దీంతో నారావారిపల్లె రామ్మూర్తిని తలచుకుంటూ విషాదంతో గడిపారు.
Next Story