రఘురామకృష్ణ రాజును లేపేయాలని జగన్ ప్రయత్నించారా!
x
Source: Facebook

రఘురామకృష్ణ రాజును లేపేయాలని జగన్ ప్రయత్నించారా!

టికెట్ దక్కకపోవడంపై రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబు న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానంటూ


2024 ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కావాలా.. వద్దా అన్న అంశంపైనే జరుగుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ప్రశ్నలకు ప్రజల ఆల్రెడీ జవాబు సిద్ధంగా ఉంచుకున్నారని, మే 13న జరిగే పోలింగ్‌లో ముక్తకంఠంతో ప్రజలు చెప్పే సమాధానం జూన్ 4న రాష్ట్రమంతటా రీసౌండ్ వస్తుందని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, వాటిపై తాను ఒంటరిగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నానని రచ్చబండ కార్యక్రమంలో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారాయి.

నన్ను లేపేయడానికి జగన్ ప్లాన్
‘‘11 ఛార్జ్‌షీట్‌లకు సంబంధించి జగన్.. 3 వేల కన్నా ఎక్కువ వాయిదాలు కోరారు. అందుకు సీబీఐ కోర్టు కూడా అనుమతించింది. అంతేకాక జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు సహా ఇతర కేసుల దర్యాప్తు కూడా అతీగతీ లేకుండా పోవడం దురదృష్టకరం. దీనిపై రాష్ట్రంలో స్పందించిన ఏకైక వ్యక్తిని నేనే. జగన్ బెయిల్‌ రద్దు చేయాలని, ఆయన కేసుల్లో పురోగతిని పరిశీలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించా. అది నచ్చకనే నన్ను లేపేయాలని జగన్ ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే అప్పట్లో తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయించి కొట్టించారు. కానీ వెంకటేశ్వరుని దయతో బతికి బయటపడ్డాను. అయినా నేను నా పోరాటం ఆపను. జగన్‌పై పోరాటాన్ని కొనసాగిస్తా. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం సాగుతుంది’’అని వెల్లడించారు.
ఒంటరి పోరాటం చాలా కష్టం
ఒక నియంతను ఎదిరించి పోరాడటం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలని రఘురామ కోరారు. ‘‘జగన్ విముక్త ఆంధ్ర కోసం సుమారు 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలు పాటుపడుతుండటం అభినందనీయమే. కానీ ఒక నియంతను ఒంటరిగా ఎదిరించి నిలబడటం చాలా కష్టం. దానిని ప్రజలు గుర్తించాలి. మా నాయనమ్మ మరణిస్తే ఆఖరి చూపు చూసుకోవడానికి సొంత ఊరికి కూడా వెళ్లలేకుండా చేశారు. నా సొంత నియోజకవర్గంలో ప్రధాని పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అతిథుల జాబితాలో నా పేరు ఉంటే వాళ్లు తట్టుకోలేక పోయారు. ప్రధాని కార్యాలయానికి స్వయంగా ఫోన్ చేసిన నా పేరును తొలగింపజేశారు. ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడా లేదు.. ఉండదు. కానీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారు పెట్టిన హింసలన్నింటినీ భరించా. ఇప్పుడు ప్రజల సమయం వచ్చింది’’ అని అన్నారు రఘురామకృష్ణ రాజు.
సమాచార లోపం వల్లే సీటు దక్కలేదు
తనకు సీటు దక్కకపోవడానికి కొద్దిపాటి సమాచార లోపమే కారణమని భావిస్తున్నట్లు రఘురామ వెల్లడించారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కూడా భాగం కావాలని పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రయత్నిస్తే, ఇదే అంశంపై తాను ఢిల్లీలో ఎన్నో రోజులు చర్చలు చేశానని తెలిపారు. ‘‘నాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. రెండు మూడు రోజుల్లో ఏ విషయం తెలుస్తుంది. నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది’’అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More
Next Story