‘ఇక్కడే ఉంటా.. అందుబాటులో ఉంటా’.. నగరిలో రోజా సడెన్ ఎంట్రీ..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత హాట్ టాపిక్‌గా నిలిచిన వ్యక్తుల్లో ఆర్‌కే రోజా ఒకరు. స్థానిక నేతలు వద్దన్నా వైసీపీ అధిష్టానం మాత్రం రోజాకే టికెట్ కట్టబెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత హాట్ టాపిక్‌గా నిలిచిన వ్యక్తుల్లో ఆర్‌కే రోజా ఒకరు. స్థానిక నేతలు వద్దన్నా వైసీపీ అధిష్టానం మాత్రం రోజాకే టికెట్ కట్టబెట్టింది. కానీ ఎన్నికల్లో రోజా పరాజయాన్ని చవి చూశారు. అప్పటి నుంచి రోజా అతి తక్కువ సందర్భాల్లో ప్రజల మధ్యకు వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చడీచప్పుడు లేకుండా ఉన్న ఆమె ఒక్కసారిగా ప్యారిస్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఆర్‌కే రోజా.. తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారన్న వార్త రాష్ట్రమంతటా పెనమోగిపోయింది. ఆ నాటి నుంచి ఇప్పటికి కూడా రోటా దారి అటా.. ఇటా.. అన్నదే సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రస్టింగ్ టాపిక్స్‌లో కూడా రోజా రాజకీయ భవితవ్యం టాప్‌లో నిలిచింది. ఇండస్ట్రీ కూడా రోజాను దూరం పెట్టిందని, ఇలాంటి సమయంలో ఆమె ఏ దారిని ఎన్నుకుంటారు అన్న దానిపైనే ఎక్కడ చూసినా చర్చ కొనసగుతోంది.
భర్త సహాయంతో తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ
2024 ఎన్నికల్లో మరోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రోజా ఎంతో తపన పడ్డారు. కానీ ప్రజలు మాత్రం ఆమె ఆశలపై నీళ్లు చల్లి బుస్సు.. మనిపించారు. ఎన్నికల్లో రోజా 45వేల ఓట్ల భారీ తేడాతో పరాజం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కువ కాలం చెన్నైలో గడుపుతుండటం.. ఆంధ్ర రాజకీయాలపై కనీసం స్పందించనుకూడా స్పందించకపోవడంతో.. తమిళనాడు రాజకీయాలపై రోజా దృష్టి పెట్టారన్న ప్రచారం మొదలైంది. తన భర్త ఆర్‌కే సెల్వమణికి తమిళనాడులో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని.. ఆమె ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్ల పోటీ చేసేలా రోజా ప్లాన్ చేస్తున్నారని తెగ ప్రచారం సాగింది.
తెలంగాణను చుట్టేసిన రోజా..
ఈ ప్రచారం జోరందుకు కొన్ని రోజులకే రోజా గుళ్లూగోపురాలు చుట్టేయడం ప్రారంభించారు. ప్రధానంగా తెలంగాణలోని ప్రముఖ గుళ్లను సందర్శించారు. ఇటీవల కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌ను కూడా సందర్శించారు. అయినా ఈ ప్రచారానికి బ్రేక్ పడలేదు. దానికి తోడు ఈ ప్రచారాలపై కూడా రోజా నోరు మెదపకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బూస్ట్ ఇచ్చినట్టయింది. తమిళనాడు రాజకీయ పార్టీలతో ఆమె భర్త సెల్వమణికి ఉన్న సంబంధాలు, తమిళనాడులో పుట్టుకొస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించనున్నాయంటూ ప్రచారం మరింత జోరందుకున్నాయి.
రోజా ప్రత్యక్షం..
రాజకీయాల్లో రోజా దారెటు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంతలో ఈరోజు రోజా ఒక్కసారిగా పుత్తూరులో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలను కలిశారు. నియోజకవర్గంలోని స్థితి గతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన రాజకీయ ప్రయాణం గురించి ఆమె స్పష్టతనిచ్చారు. పుత్తూరులోని బలిజ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన రాజకీయ భవిత్యంపై క్లారిటీ ఇచ్చారు.
ఇక్కడే ఉంటా..
‘‘తమిళ సినిమాల్లో నటించిన నేను వాళ్లకి అభిమాన హీరోయిన్‌గానే ఉంటాను. అధికారం కోసం నన్ను రాజకీయంగా ఆదరించిన ప్రజలను వదులుకోను. నేను పుట్టింటి రాజకీయాలకే పరిమితం అవుతాను. ఇక్కడే ఉంటా. అధికారపక్షమైనా, ప్రతిపక్షమనా ఇక్కడే ఉండి ప్రజల తరపున పోరాడుతా. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా. నేను ఎన్నికల్లో అంతటి ఘోర ఓటమి చెందే అంతటి తప్పులు చేయలేదు’’ అని వివరించారు.
పార్టీ పారడమే రోజా ప్లానా..
అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఖాళీ అయ్యే దాఖలాలు కనిపిస్తున్న వేళ రోజా ప్రత్యక్షం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పార్టీ ఖాళీ అవుతున్న క్రమంలో పార్టీలో కీలక స్థానానికి ఎదగడానికి ఇదే మంచి అవకాశం అనుకునే రాజో సడెన్ రిటర్న్ అయ్యారా? లేకుంటే మరోసారి కొంతకాలం ఏపీ రాజకీయాల్లో తలుక్కుమని జెండా మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.