తాడేపల్లిలో ఐఎఎస్ కుమార్తె బలవన్మరణం
x
మాధురీ

తాడేపల్లిలో ఐఎఎస్ కుమార్తె బలవన్మరణం

ఐఎఎస్ కుమార్తెకూ తప్పని వరకట్న వేధింపులు: పెళ్లైన 8 నెలలకే ఆత్మహత్య


గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో ఓ ఐఏఎస్ కుమార్తె మాధురి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సెక్రెటరీ ఎస్. చిన్న రాముడు IAS కుమార్తె. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లోని ఎస్సీ కమిషన్ ఆఫీసులో ఆయన పని చేస్తుంటారు. చినరాయుడు ఇటీవలే ఎస్సీ కమిషన్ సెక్రటరీగా వచ్చారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు.
ఎస్సీ కమిషన్ సెక్రటరీగా చేరిన తర్వాత ఆయన తాడేపల్లి లోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఆయన కుమార్తె మాధురీకి ఎనిమిది నెలల కిందట రాజేష్ నాయుడు అనే వ్యక్తి కులాంతర వివాహం చేసుకున్నారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం మాధురీని రాజేష్ నాయుడు కట్నం కోసం వేధించారు. ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉన్న రాజేష్ పెళ్లయిన రెండో నెల నుంచే కట్నం కోసం వేధించాడు అంటూ మాధురీ తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేశారు. 'మీ నాన్న అధికారి. డబ్బులు బాగుంటాయి. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని వేధించారు. మాధురి తన తల్లికి ఫోన్లో ఈ విషయాన్ని తెలియజేసినట్టు' పోలీసులు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు. రాజేష్ నాయుడి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన తల్లిదండ్రులకు వద్దకు వచ్చింది.

ఈనేపథ్యంలో నిన్న ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయిందని, మానసికంగా వేధించడం వల్లే తమ కుమార్తె మరణించిందని మాధురి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story