ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులు చేసేది గుమస్తాగిరి ఏమిటి అనుకుంటుంటున్నారా? ఇది నిజం. ఐదేళ్లుగా రాష్ట్రంలో వారు చేస్తున్నది గుమస్తాగిరి మాత్రమే.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 15 మంది ఐఏఎస్‌లు రిటైర్డ్‌ అవుతున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రం నుంచి ఇప్పటికే కేంద్రానికి రిటైర్డ్‌ కాబోతున్న వారి వివరాలతో సమాచారం అందించారు. అంతవరకు బాగానే ఉంది. ఈ గుమస్తా గిరి ఏంటి? ఐఏఎస్‌లు ఏపనిచేస్తారు? ఎందుకు వారిని అత్యున్నతులుగా చూస్తారు? ఇది మనం తెలుసుకోవాలి.

పాలసీలు తయారు చేసేది ఐఏఎస్‌లేనా?
ప్రభుత్వ పాలసీలు తయారు చేసేది ఐఏఎస్‌లేనా? అవుననే సమాధానం ఎవరి నుంచైనా వస్తుంది. ప్రభుత్వ కార్యదర్శులు, కమిషనర్లుగా సీనియర్‌ ఐఏఎస్‌లు ఉంటారు. వారికి అన్ని అంశాలపైన సమగ్ర అవగాహన ఉంటుంది. అందుకే ఏ పథకానికైనా రూపకల్పన చేసి తగిన గైడ్‌లైన్స్‌ తయారు చేస్తారు. దీనిని పాలకుల వద్ద పెడితే బాగుంటే అమలు చేస్తారు. లేకుంటే వదిలేస్తారు.
పాలకులు ఐడియాలు ఇవ్వాలి
పాలకులు ఐడియాలు ఇవ్వాలి. అవి ఎలా అమలు చేయాలో, ఆ పథకానికి ఎటువంటి నిబంధనలు ఉండాలో అధికారులు చూసుకుంటారు. అందుకే కదా ఐఏఎస్‌లకు లక్షల్లో జీతాలు ఇచ్చి ప్రభుత్వ శాఖలకు కార్యదర్శులుగా నియమించుకుంటారు. కానీ ఐడియాలు పాలకుల నుంచి వస్తున్నా అధికారులు ప్రమేయం లేకుండా సాగుతున్నాయి. ఒకరిద్దరు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి అన్నీ తామే అంటూ చూసుకోవడం పరిపాటిగా మారింది.
కార్యదర్శులు ఏమి చేస్తున్నారు
తమ వద్దకు వచ్చిన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి తిరిగి కమిషనర్‌లకు పంపిస్తారు. జీవోలు తయారు చేస్తున్నది కూడా కమిషనర్లే. తయారు చేసిన జీవోలను కార్యదర్శులకు పంపిస్తే పరిశీలించి ఒక సంతకం చేసి విడుదల చేస్తున్నారు. కేవలం సంతకం మాత్రమే చేస్తున్నారు. ఆ సంతకం చేసే ముందు బాగోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఏమీ ఉండదు. లబ్ధిదారుల లిస్ట్‌ మాత్రమే ఉంటుంది. పేర్లు తప్పులు లేకుండా చూసుకునే బాధ్యత కింది స్థాయి ఉద్యోగులది. అందువల్ల పేర్లను కూడా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎంత మంది ఉన్నారనే సంఖ్య గుర్తు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే అప్పుడప్పుడు ఎంతమందికి మనం సాయం చేసాం అనే సంఖ్య పాలకులు కార్యదర్శులను అడుగుతుంటారు. అందుకని గుర్తుంచుకోవాలి.
పాలకులే కార్యదర్శులుగా మారారా?
పాలకులు ఐడియాలు ఇస్తే పథకాల రూపకల్పనలో కార్యదర్శలు సలహాలు, సూచనలు ఇచ్చి దానికో రూపం కల్పిస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం ఐడియాతో పాటు అందులో ఏ అంశాలు ఉండాలో కూడా పాలకులే చెబుతారు. అవన్నీ నోట్‌ చేసుకుని కార్యదర్శులు గుమస్తాగిరి చేస్తారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఒక సంఘటన చూద్దాం. డిఎస్సీ నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు మొటిక్కాయ వేసింది. దీంతో కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని చెప్పింది. ఇందులోనే ఇంకో అంశం ఏమిటంటే సెకండరీ గ్రేడ్‌ పోస్టులకు బీఈడీ వారు అర్హులు కాదని గతంలో సర్క్యులర్‌ ఇచ్చింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో బీఈడీ వారు అర్హులని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో తెలిపింది. దీనిని కూడా కోర్టు తప్పుపట్టింది. ఆ తరువాత కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని తలూపింది ప్రభుత్వం. ఇవన్నీ పాలకులు చేస్తున్న తప్పులా అధికారులు చేస్తున్న తప్పులా? పాలకులు చెప్పినట్లు కార్యదర్శులు తలూపుతున్నారు. లేకుంటే అక్కడి నుంచి వారికి స్థాన భ్రంశం తప్పదు. ఇదంతా మాకెందుకనుక్ను ఐఏఎస్‌లు నేతలు ఏమి చెప్పినా, అది రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనా చేద్దామంటున్నారు.
రాజధాని విషయం తీసుకుందాం..
మూడు రాజధానులు బిల్లు దేనికి సంకేతమో అధికారులకు తెలియదా? ఆ విషయం సీఎంఓలోని ఐఏఎస్‌లు ముఖ్యమంత్రికి చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు. పూసగుచ్చినట్లు వివరించారు. అయితే అధినేత ఒప్పుకున్నారా.. నేను చెప్పినట్లు చెయ్యండన్నారు. అదే చేశారు ఐఏఎస్‌లు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ అధినేత పట్టు వదలలేదు. మూడు రాజధానులు అంటూనే ఉన్నారు. అందుకే ఐఏఎస్‌లు చేస్తున్నది గుమస్తాగిరి కాక ఏమంటారు? మీరంతా ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా?
ఇక్కడ వినూత్న పథకాలేమైనా ఉన్నాయా?
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవన్నీ వినూత్న పథకాలేనా? అందరికీ ఉచితంగా డబ్బులు పంచే పథకాలు. ఈ పథకాల రూపకల్పనకు కష్టపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే పది లైన్లు గైడ్‌లైన్స్‌ చాలు. లబ్ధిదారుని ఎంపిక చేసే పనిని వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించింది. వారి నుంచి జాబితా వస్తుంది. సీఎంలో మొదట జాబితా పరిశీలించి కార్యదర్శులకు పంపిస్తున్నారు. వారు పరిశీలించి కమిషనర్లకు పంపిస్తారు. వారు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు చేరే విధంగా చర్యలు తీసుకుంటారు. అంతే ఎంత సింపుల్‌. దీనికి ఐఏఎస్‌ ఆలోచనలు అవసరం లేదు. చదువుకున్న వారైతే చాలు.

మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసమే ఐఏఎస్‌లు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భిన్న సంస్కృతి వచ్చింది. ఐఏఎస్‌ అధికారులను కేవలం మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తే చాలు. దీని కోసమే ఐఏఎస్‌లను ప్రభుత్వం వాడుకుంటోంది. ప్రస్తుతం ఏపిలో ప్రధాన యాక్టివిటీ ఇదే. కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఐఏఎస్‌లకు ఇక్కడ ప్రత్యేకంగా పనేమీ లేదు.

జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ కుమార్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌

సీనియర్ IAS అధికారుల బాధ్యత

తమకు కేటాయించిన subject ను కూలంకుషంగా పరిశీలించి short term , long term విధానాలను మంత్రులకు, cabinet కు ప్రతిపాదించడం. తలుచుకుంటే వారిని ఆ విషయంలో ఎవరూ అడ్డుకోలేరు. IAS లో join అయిందే అటువంటి బాధ్యతలను చేపట్టడం కోసం. అటువంటి బాధ్యతలను చేపట్టకపోతే, వారు గుమాస్తాలుగా మారుతారు.

మా time లో రమేషన్ అనే సీనియర్ అధికారి ఉండేవారు. ఆయన ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పే అధికారి. అటువంటి వారు కొంతమంది రాజకీయ నాయకులకు సరిపోరు. ఆయనను ఆర్కియాలజీ డైరెక్టర్ గా పోస్ట్ చేశారు. ఆ అవకాశం ఉపయోగించుకుని రమేషన్ గారు ఆ డిపార్ట్మెంట్ లో చైతన్యం తేగలిగారు. జిల్లాల వారీగా బ్రిటిష్ వారు 50 years ముందు తయారు చేసిన Gazetteer లను update చేయించి ప్రచురించారు. ఈ రోజు ఒక జిల్లా గురించి ఏ విషయమైనా తెలుసుకోవాలంటే, అటువంటి Gazetteer లే అందుబాటులో ఉంటాయి.

అదే కాకుండా రమేషన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాల చరిత్రను విపులంగా తెలియపరిచే ఒక మంచి పుస్తకాన్ని రాసి ప్రజలకు అందించారు. ఆయన ఆధ్వర్యంలో ఆ department మీద ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు గౌరవం పెరిగింది.

ఇప్పటి పరిస్థితి, చాలా మంది అధికారులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే "punishment" గా భావిస్తారు. అధికారుల దృక్పధంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. air conditioned కారుల్లో ప్రయాణం చేయడం, 5-star హోటళ్లలో బస చేయడం లక్ష్యంగా మారింది.

అయినా కొంతమంది అధికారులలో విలువలు జీవించి ఉండడం మన అదృష్టం. అటువంటి అధికారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం అవసరం.

అప్పుడప్పుడు ఏ రాష్ట్రంలోనైనా అటువంటి IAS/ IPS అధికారులు కనిపిస్తే, నేను వారి టెలిఫోన్ నంబర్లను సేకరించి వారికి టెలిఫోన్ చేసి అభినందిస్తాను. నిజాయితీ ఉన్న ఒక హర్యానా మహిళా IPS అధికారిని ఒక మంత్రి దూషించడం TV లో చూడగానే ఆమెకు అప్పటికప్పుడే టెలిఫోన్ చేసి, ఆమెను సమర్ధించడమే కాకుండా రాష్ట్ర Chief Secretary కి ఆమెను సమర్థించాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసాను.

ఇ.ఎ.ఎస్. శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.

Next Story