మార్పు కోసం లిబరేషన్
x
మాజీ ఐఏఎస్ విజయ భాస్కర్

మార్పు కోసం 'లిబరేషన్'

నిస్వార్థ సేవ, నిబద్ధత లక్ష్యాలుగా రాజకీయప్రవేశం చేశా అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత విజయ్ కుమార్ అన్నారు. ఎల్‌సిపి అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు.


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మూడు పార్లమెంటు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధినేత మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ తొలి జాబితాను విడుదల చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

పార్లమెంట్ అభ్యర్థులు వీరే....

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ(lcp) మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తిరుపతి నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ పోటీ చేస్తుండగా.... ఏలూరు నుంచి డాక్టర్ మొండెం సంతోష్ కుమార్, రాజంపేట నుంచి పీర్ సయ్యద్ షా షబ్బీర్ అలం ఖాద్రి ఎన్నికల బరిలోకి దిగారు. చేస్తున్నారు.

12 మంది అసెంబ్లీ అభ్యర్థులు....

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ(lcp) రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. మండపేట టీ. ధనరాజు, జగ్గంపేట సాదే నరేంద్రబాబు, కొవ్వూరు బంతా శ్యామ్ రవి ప్రకాష్, తిరువూరు శీలం రాజా, నూజివీడు షేక్ జానీ,ఎర్రగొండిపాలెం తేళ్ల ఎఫ్‌సీ రాణి, కొండసి కనపర్తి శివరాం, గిద్దలూరు ఠాగూర్ నాయక్ జనావత్, కనిగిరి దమ్ము వెంకటేష్, ఆత్మకూరు శేషం సుదర్శన్, రాయచోటి ఏ హరికృష్ణ, శ్రీకాళహస్తి కుప్పన్నగారి ధనుంజయల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

బహుజనులకే అధిక ప్రాధాన్యత...

'మా పార్టీలో బహుజనులకే అధిక ప్రాధాన్యత ఇస్తాం. బహుజనులను ఐక్యం చేయడమే మా లక్ష్యం. అందుకే బహుజనుల పార్టీలపై కూటమి ఏర్పాటు చేసాం. ఐదు పార్టీలతో ప్రారంభించబడిన కూటమి 9 పార్టీలకు చేరింది. 9 పార్టీల అధ్యక్షులు మినహా అన్ని చోట్ల లిబరేషన్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది' అని ఎల్‌సీపీ అధినేత విజయ్ కుమార్.. ది ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.



Read More
Next Story