ఏపీలో అక్రమ అక్వా రైతులు రెచ్చి పోతున్నారు. విచ్చల విడిగా అక్రమ సాగులకు తెగబడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రజా హితం కోసం.. పర్యావరణం కోసం పాటుపడుతున్న ఓ కార్యకర్త పట్ల అక్రమార్కులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అవమానకరంగా హింసించారు. ఏకంగా స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడారు. అత్యంత దారుణమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన ఓ పర్యావరణ కార్యకర్త కోనసీమలో అక్రమ ఆక్వా సాగును వ్యతిరేకించినందుకు ఆక్వా రైతులు దారుణంగా కొట్టారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి అనధికారికంగా ఆక్వా చెరువులు నిర్వహిస్తున్న ఆక్వా రైతులపై బాధితుడు చిక్కం వీర దుర్గా ప్రసాద్‌ న్యాయ గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ అక్వా సాగు చెరువుల వల్ల నీటి కాలుష్యం పెరిగి పోతుందని, తద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ కార్యకర్త దుర్గాప్రసాద్‌ గతంలో ఆందోళనలు కూడా చేశారు. కానీ అక్రమార్కులు పెడన చెవిన పెట్టడంతో కోర్డును కూడా ఆశ్రయించారు. దుర్గప్రసాద్‌ ఫిర్యాదు మేరకు న్యాయస్థానం అక్రమ ఆక్వా చెరువుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆక్వా రైతులు మళ్లీ చెరువులను తవ్వే ప్రయత్నం చేశారు. దీంతో వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించాలని అధికారుల సలహా మేరకు దుర్గాప్రసాద్‌ అక్రమాస్తుల ఫొటోలు తీసేందుకు ఘటనా స్థలాన్ని సందర్శించారు. దీంతో ఆక్వా రైతులు అతడిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. అక్రమార్కుల చేతిలో అన్యాయంగా దెబ్బలు తిన్న దుర్గాప్రసాద్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు దుర్గాప్రసాద్‌పై దాడికి పాల్పడిన వారిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురు నిందితుడలపై ఉప్పలగుప్తం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిసింది.
Next Story