ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారులపైన, స్థానిక ఎమ్మెల్యేపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంవో, కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానన్నారు.


రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు వల్లే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, అధికారులు సక్రమంగా ఉంటే ఎందుకు అక్రమ రవాణా జరుగుతుందని నిలదీశారు. కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. రేషన్‌ బియ్యం విషయంలో కాంప్రొమైజ్‌ అయ్యారా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)ను పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

ఇంత భారీగా రేషన్‌ బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రతీసారి మా లాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ ఈ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఆపలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును కూడా పవన్‌ కళ్యాణ్‌ తప్పుబట్టారు. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్‌ బియ్యం ఎలా వస్తాయి? అంటూ అధికారులపై పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. ఆ టైంలో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదు. దీంతో ఆ టీడీపీ ఎమ్మెల్యే నీళ్లు నములుతూ కనిపించారు. పశ్చిమాఫిక్రా దేశాలకు అక్రమంగా ఈ బియ్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా, తామే స్వయంగా ఛేజ్‌ చేసి పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించున్నాయి. కాస్త గ్యాప్‌తో మరోసారి.. ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును టార్గెట్‌ చేశారు. ఈసారి
ట్రక్కులో ప్రయాణిస్తూ కొండబాబుపై మండిపడ్డారు. బిజినెస్‌ అంటే స్మగ్లింగ్‌ను, స్మగ్లర్‌లను అనుమతించడం కాదు కదా అని పవన్‌ కళ్యాణ్‌ అనడంతో ఎమ్మెల్యేల కొండబాబు ఖంగుతిన్నారు. మనం ఏమీ చెయ్యకపోతే రేషన్‌ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్‌ అన్నారు. దానికి.. రేషన్‌ బియ్యంపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు. అయినా కూడా పవన్‌ కళ్యాణ్‌ ఆ మాటలు పట్టించుకోకుండా, కాకినాడ పోర్టు నుండి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకి, పీఎంవోకు లేఖ రాస్తానని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. అక్కడ నుంచి రేషన్‌ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్‌లో వెళ్లి మరీ పవన్‌ పరిశీలించడం గమనార్హం. తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరకున్నాక.. ఎస్పీ ఎందుకు నిపించడం లేదు? నేను వచ్చే టైంకి ఎస్పీ ఎందుకు సెలవు తీసుకున్నారు? ఇదంతా చాలా బాగుంది అంటూ పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Next Story