ప్రతిపక్షాన్ని తిడితేనే పార్టీలో ఉండండి. లేకుంటే వెళ్లిపోండని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు.
ప్రతిపక్షాన్ని తిడితేనే పార్టీలో ఉండండి. లేకుంటే వెళ్లిపోండని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ప్రతిపక్షంపై విమర్శలు చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందుకు సచేమిరా అంగీకరించేది లేదని వారు నిరాకరించారు. విమర్శలు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌లపై చేయాలని ముఖ్యమంత్రి సూచించారు, మీరు నేరుగా విమర్శించడం చేతకాకపోతే కావాల్సిన సమాచారంతో ప్రెస్ బ్రీఫ్ నోట్ ఉంటుందని, దీనిని చూసైనా విమర్శ చేయాలని సీఎం నుంచి సమాచారం అందింది. ఎన్ని బూతులుంటే అన్ని బూతులు వీరిపై ఉపయోగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇరువురు ఎంపీలకు సూచించినట్లు సమాచారం.
ప్రతిపక్షాన్ని తిట్టలేదనే నాకు సీటివ్వలేదు
నేను ప్రతిపక్షాన్ని తిట్టలేదనే నాకు సీటు ఇవ్వలేదని భావిస్తున్నాను. విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలే కాని వికృతరూపం దాల్చ కూడదు. నాకు సీటు ఇవ్వలేదంటే అదొక కారణం అని పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఆదివారం టీవీ5కు ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు. నేను సాధికార యాత్రలో కూడా ప్రజలు నన్ను ఆదరిస్తున్నా మా నాయకుడు మాత్రం నన్ను గుర్తించలేదన్నాను. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాస్థలాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఇచ్చి పార్టీని ఆదరించాను. ఇంట్లో వాళ్లు వద్దన్నా నేను పట్టిచుకోకుండా పార్టీ కార్యాలయం నడిపించాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నాకు మంత్రి వస్తుందని ఆశించాను కానీ రాలేదు. రెండో సారి మంత్రి వర్గ ఏర్పాటులోనైనా వస్తుందని ఆశించాను. అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు టిక్కెట్‌కూడా దక్కకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయకపోవిడమే.